Sunday, May 19, 2024

నెటిజన్ల ట్రోల్ ..కౌంటర్ ఇచ్చిన ‘సుహానా’

బాలీవుడ్ బాద్ షా కుమారై సుహానా ఖాన్ పై తెగ ట్రోలింగ్ జరుగుతోంది. వాటిపై సుహానా సున్నింతంగా కౌంటర్ ఇచ్చింది. కొన్నాళ్ల క్రితం సుహానా చాలా నల్లగా కనిపించేది. తెల్లగా కనిపించేందుకు ఆమె ఆపరేషన్ చేయించుకుంది. కాస్త అందంగా మారిన త‌ర్వాత  త‌ర‌చు  ఫొటో షూట్స్ చేస్తూ వాటిని సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. అయితే సుహానా ఫొటోల‌పై కొంద‌రు నెటిజ‌న్స్ ఘాటుగా స్పందించారు. ఇప్పుడు నువ్వు అందంగా కాకుండా అబ్బాయిలా క‌నిపిస్తున్నావ‌ని, చూడ్డానికి చెండాలంగా ఉన్నావ‌ని కామెంట్స్ పెడుతున్నారు.వీటిని స్క్రీన్ షాట్ తీసి త‌న సోషల్ మీడియాలో షేర్ చేసిన సుహానా .. చిన్న‌ప్పుడు ఒక‌లా పెద్దైన‌ప్పుడు ఒక‌లా ఉండ‌డం కామ‌న్. పెద్ద‌గా మారిన త‌ర్వాత మ‌న‌లో చాలా మార్పులు వ‌స్తాయి. ఈ విష‌యం ప‌ట్టించుకోకుండా ఇష్ట‌మొచ్చిన‌ట్టు కామెంట్ చేయ‌డం మంచిది కాదంటూ సుహానా కూల్‌గా చెప్పింది.  ప్ర‌స్తుతం ఈ అమ్మ‌డికి ఇన్ స్టా గ్రామ్ లో ఏకంగా 1.5 మిలియన్ ల ఫాలోవ‌ర్స్ ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement