Friday, June 14, 2024

దుబాయ్ షెడ్యూల్ కంప్లీట్..

డైరెక్టర్ పరశురాం తెరకెక్కిస్తోన్న చిత్రం సర్కారు వారి పాట. ఈ మూవీ సూపర్ స్టార్ మహేశ్ బాబుకి 27వ చిత్రం. ఈ మూవీ గత నెల రోజులుగా దుబాయ్ లో షూటింగ్ ని జరుపుకుంటోంది. కాగా ఈ షెడ్యూల్  పూర్తయింది. తదుపరి షెడ్యూల్ గోవాలో జరగనుందని టాక్. కాగా  దుబాయ్ షెడ్యూల్‌లో యాక్ష‌న్ స‌న్నివేశాలు, మ‌హేశ్, కీర్తిసురేష్‌ల‌పై కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించింది చిత్ర యూనిట్‌. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను వ‌చ్చే ఏడాది సంక్రాంతికి విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. మైత్రీ మూవీ మేక‌ర్స్‌, 14 రీల్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, జీఎంబీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ప‌తాకాల‌పై సినిమా నిర్మిత‌మ‌వుతోంది. 

Advertisement

తాజా వార్తలు

Advertisement