Saturday, April 27, 2024

ఇళయరాజా సొంత స్టూడియోలో ‘రజనీకాంత్’

స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా స్టూడియోలో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ మెరిశారు.  ఇళయరాజా సొంతంగా నిర్మించుకున్న స్టూడియోను  సందర్శించారు  రజనీకాంత్‌ . స్థానిక త్యాగరాయనగర్‌, కోడంబాక్కం హైరోడ్డులో ఉన్న ఎంఎం ప్రివ్యూ థియేటర్‌ ప్రాంగణంలో దీన్ని ఏర్పాటు చేశారు. అత్యాధునిక హంగులతో నెలకొల్పిన ఈ స్టూడియోను ఇటీవలే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇళయరాజా స్టూడియో నిర్మాణం గురించి రజనీకాంత్‌ వాకబు చేశారు. ఆ తర్వాత ఇళయరాజాతో కలిసి రజనీకాంత్‌ కూడా ఆ స్టూడియోకు వెళ్ళి సందర్శించారు. స్టూడియో మొత్తం కలియతిరుగుతూ నిశితంగా పరిశీలించారు. ఈ స్టూడియో నిర్మాణాన్ని చూసిన ఆయన అబ్బురపరిచేలా నిర్మించారంటూ ఇళయరాజాను అభినందించారు. ఆ తర్వాత స్టూడియోలో ఇళయరాజాతో ఎక్కువ సమయం గడిపారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement