Friday, May 17, 2024

అందుకే డ్రైవింగ్ కి దూరంగా ఉంటా

హీరోయిన్ శృతిహాసన్ కి  చాలా వ‌రస్ట్‌గా డ్రైవింగ్ చేసే అలవాటు ఉందట. నా అంత చెడ్డ‌గా ఎవ‌రూ డ్రైవింగ్ చేయ‌లేరేమో. ఈ కార‌ణం వ‌ల్లే నేను బండి చక్రాల‌కు, డ్రైవింగ్‌కు  దూరంగా ఉంటాను. ఒక‌వేళ నాకు డ్రైవింగ్ చేయాల‌నిపిస్తే నా రెడ్ క‌ల‌ర్ రేంజ్ రోవ‌ర్ కారును తీసుకెళ్తా. భ‌విష్య‌త్‌లో ఎలక్ట్రిక్ కొనాల‌నుకుంటున్నా. ఎలక్ట్రిక్ కార్లు వాతావ‌ర‌ణం కాలుష్యం కాకుండా కాపాడుతాయి అందుకే అవి కొనాల‌ని ఇష్టం. ఇంధ‌నంతో న‌డిచే కారు కొంటావా..? ఎల‌క్ట్రిక్ కారు కొంటావా అని అడిగితే..రెండోసారి ఆలోచించ‌కుండా ఖ‌చ్చితంగా ఎల‌క్ట్రిక్ కారు అని చెప్తాన‌ని చెప్పుకొచ్చింది క్రాక్ భామ‌. ఈ బ్యూటీ ప్రస్తుతం ప్ర‌భాస్‌తో స‌లార్ చిత్రంలో హీరోయిన్ గా న‌టిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement