Saturday, May 18, 2024

పెరగనున్న పని గంటలు – వేతనాల్లోనూ మార్పులు.. ఇక నుంచి 12 గంటల పని

కేంద్రం సవరించిన కార్మిక చట్టాలను జులై 1 నుంచి అమల్లోకి తీసుకురానుంది. దీని వల్ల కార్మికులు పోరాడి సాధించుకున్న పని గంటల్లో మార్పు రానుంది. పని గంటలతో పాటు ఎంప్లాయిస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌, వేతనాల్లోనూ మార్పులు రానున్నాయి. కార్మిక చట్టాల్లో చేసిన మార్పుల వల్ల పని గంటలు పెరుగుతాయి.యాజమాన్యలు చెల్లించే పీఎఫ్‌ కంట్రిబూషన్‌ తగ్గిపోతుంది. కార్మికులు, ఉద్యోగులకు చేతికి అందే నికర వేతనం కూడా తగ్గిపోనుంది. దేశంలో అన్ని కార్మిక సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నప్పటికీ కేంద్రం కొత్త కార్మిక చట్టాలను జులై 1 నుంచి అమల్లోకి తీసుకు రావాలని నిర్ణయించింది. కొత్త కార్మిక చట్టాలు, లేబర్‌ కోడ్స్‌ను అమలు చేసేందుకు ఇప్పటి వరకు 23 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ముందుకు వచ్చాయి. ఈ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఇప్పటికే కొత్త చట్టాల నిబంధనలు, అంశాలపై డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్లు విడుదల చేశాయని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పనా శాఖ సహాయ మంత్రి రామేశ్వర్‌ తేలి చెప్పారు.

ప్రధానంగా విపక్ష పార్టీలు ముఖ్యంగా వామపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో వీటిని అమలు చేయబోమని ప్రకటించాయి

కొత్త కార్మిక చట్టాల ప్రకారం కంపెనీలు ఇక నుంచి 8 గంటల పని విధానాన్ని 12 గంటల వరకు పెంచుకునే వీలు కలుగుతుంది. ఇలా పని గంటలు పెంచిన కంపెనీలు కార్మికులకు మూడు వారంతపు సెలవులు ఇవ్వాల్సి ఉంటుంది. కొత్త వేతన నిబంధన ప్రకారం వారానికి 48 పని గంటలు ఉండాలి. పని గంటలు పెంచడం వల్ల వారంలో చేసే పని గంటలు మాత్రం తగ్గవు. ఉద్యోగులు, కార్మికులు ఇంటికి తీసుకు వెళ్లే వేతనంలోనూ మార్పు రానుంది. మొత్తం నెల వేతనంలో బేసిక్‌ సాలరీ 50 శాతం ఉండాలి. ఉద్యోగులు, కార్మికులు, యాజమాన్యం చెల్లించే పీఎఫ్‌ కం ట్రీబ్యూషన్‌ కూడా పెరగనుంది.కొత్త కార్మిక చట్టలు, వేతన నిబంధనల మూలంగా ప్రధానంగా ప్రయివేట్‌ రంగంలోని కార్మికులు, ఉద్యోగులకు ఎక్కువ నష్టపోనున్నారు. మొత్తం 29 కేంద్ర కార్మిక చట్టాల్లోనూ నాలుగు లేబర్‌ కోడ్స్‌ జోడించారు. వీటిలో పని గంటలు, వేతనాలు, సామాజిక భద్రత, పారిశ్రామిక సంబంధాలు, పని ప్రదేశంలో భద్రత వంటివి ఉన్నాయి. వీటిల్లోచాలా మార్పుులు యాజమాన్యలకే అనుకూలంగా ఉన్నాయన్న విమర్శలు ఉన్నాయి. కార్మికులు ఎన్నో సంవత్సరాలుగా, పోరాడి సాధించుకున్న ఎన్నో సౌకర్యాలను ఈ కొత్త లేబర్‌ కోడ్స్‌ తొలగించాయి. కార్మికుల అంశం ఉమ్మడి జాబితాలో ఉన్నందుకు కేంద్రం ఆమోదించిన కొత్త కార్మిక చట్టాలను అన్ని రాష్ట్రాలు ఆమోదించాల్సి ఉంటుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement