Saturday, April 27, 2024

యాక్సిస్‌ మ్యూచువల్‌ ఫండ్‌ నుంచి రెండు కొత్త స్కీమ్స్‌

ప్రముఖ మ్యూచువల్‌ ఫండ్‌ కంపెనీ యాక్సిస్‌ మార్కెట్‌లో రెండు సిల్వర్‌ ఫండ్స్‌ను ప్రారంభించింది. యాక్సిస్‌ సిల్వర్‌ ఈటీఎఫ్‌, యాక్సిస్‌ సిల్వర్‌ ఫండ్‌ ఆఫ్‌ ఫండ్‌ పేరుతో వీటిని లాంచ్‌ చేసింది. ఈ రెండు ఓపెన్‌ ఎండెడ్‌ స్కీమ్స్‌. యాక్సిస్‌ సిల్వర్‌ ఈటీఎఫ్‌ ఫండ్‌ సెప్టెంబర్‌ 2 న ప్రారంభమై 15వ తేదీ ముగుస్తుంది. కనీస పెట్టుబడి 500 రూపాయలు. తరువాత 1 రూపాయల నుంచి పెంచుకోవచ్చు. యూనిట్‌ సైజ్‌ 30 వేలు. ఒక్కో యూనిట్‌ ఒక గ్రాము సిల్వర్‌తో సమానం. ఎగ్జిట్‌ లోడ్‌ ఏమీ ఉండదు.
యాక్సిస్‌ సిల్వర్‌ ఫండ్‌ ఆఫ్‌ పండ్‌ సెప్టెంబర్‌ 2న ప్రారంభమై, 15వ తేదీన ముగుస్తుంది. ఇందులో కనీస పెట్టుబడి 5 వేల రూపాయలు. ఫండ్‌లో చేరిన ఏడు రోజుల్లోగా నిష్కరమిస్తే 0.25 శాతం ఛార్జీగా వసూలు చేస్తారు. ఏడు రోజుల తరువాత ఎలాంటి ఎగ్జిట్‌ లోడ్‌ ఉండదని కంపెనీ తెలిపింది.

మన దేశ మార్కెట్‌లో సిల్వర్‌కు ఎంతో ప్రాముఖ్యత ఉందని, దీని విలువ పెరుగుతూనే ఉందని కంపెనీ తెలిపింది. సిల్వర్‌ను అనేక రంగాల్లో ఉపయోగిస్తున్నారు. ఇన్వెస్టర్లకు ఇది మంచి అవకాశమని, తమకు ఇష్టమైన సిల్వర్‌లో పెట్టుబడులు పెట్టవచ్చిని తెలిపింది. సిల్వర్‌లో పెట్టుబడులతో మంచి ఫలితాలు పొందవచ్చని తెలిపింది. డీ మ్యాట్‌ అకౌంట్‌ లేని ఇన్వెస్టర్లు సిల్వర్‌ ఫండ్‌ ఆఫ్‌ ఫండ్‌లో పెట్టుబడులు పెట్టవచ్చని తెలిపింది. ఈ రెండు ఫండ్స్‌ 30 కేజీల సిల్వర్‌లో పెట్టుబడులు పెడతారు. సిల్వర్‌ను ప్రముఖ అమ్మకందారుల నుంచి సేకరిస్తారు. ఈ విలువైన మెటల్‌లో పెట్టుబడులు ఇన్వెస్టర్లకు మంచి ఫలితాలు అందిస్తాయని యాక్సిస్‌ ఏఎంసీ ఎండీ, సీఈవో చంద్రేష్‌ నిగమ్‌ చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement