Thursday, May 2, 2024

ఎట్టకేలకు లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు.. స్వల్పంగా బలపడిన రూపాయి

స్టాక్‌ మార్కెట్లు వరసగా వారం రోజుల నష్టాల నుంచి గట్టెక్కాయి. సోమవారం నాడు స్టాక్‌ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ప్రతికూల పరిస్థితుల ప్రభావం మార్కెట్ల పై పడింది. వారం పాటు నష్టాలు చూసిన ఇన్వెస్టర్లు కనిష్టాల వద్ద కొనుగోలుకు మొగ్గు చూపారు. అమెరికా మార్కెట్లు మిశ్రమంగా ముగియడం వల్ల ఆ ప్రభావం మన మార్కెట్లపై పడింది. అమెరికా లో ప్యూచర్స్‌ మాత్రం నష్టాల్లోనే ట్రేడ్‌ అవుతున్నాయి. సెన్సెక్స్‌ 237.42 పాయంట్ల లాభపడి 51,597.84 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 56.65 పాయింట్లు లాభపడి 15350.15 వద్ద ముగిసింది. పది గ్రాముల బంగారం ధర 22 రూపాయలు తగ్గి 50,812 రూపాయల వద్ద ముగిసింది. వెండి కిలో 77 రూపాయిలు తగ్గి 60,860 వద్ద ముగిసింది. డాలర్‌తో రూపాయి మారకపు విలువ 77.86 రూపాయిలుగా ఉంది.

ట్రేడింగ్‌లో గరిష్టంగా లాభపడిన షేర్లు..

హెచ్‌డిఎఫ్‌సి, సన్‌ ఫార్మా, హెచ్‌యూఎల్‌, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌, ఏషియన్‌ పెయింట్స్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, అల్ట్రా సిమెంట్స్‌, విప్రో, టీసీఎస్‌, మారుతీ, రిలయన్స్‌, లాభాల్లో ముగిశాయి.టాటా స్టీల్‌, పవర్‌ గ్రిడ్‌, ఎం అండ్‌ ఎం, ఐసిఐసిఐ బ్యాంక్‌, ఎల్‌ అండ్‌ టీ, టెక్‌ మహీంద్రా,బజాజ్‌ ఫిన్‌ సర్వ్‌, ఐటీసీ, ఎస్‌బీఐ, టైటన్‌, బజాజ్‌ పైనాన్స్‌ షేర్లు నష్టాల్లో ముగిశాయి.

బలపడిన రూపాయి..

డాలర్‌తో రూపాయి మారకం విలవ కొన్ని రోజులుగా వరసగా పతనం అవుతూనే ఉంది. చాలా రోజుల తరువాత మార్కెట్‌లో సోమ వారం నాడు రూపాయి బలపడింది. ఉదయం 77.98 రూపాయల వద్ద ట్రేడింగ్‌ ప్రారంభమైంది. విదేశీ ఇన్వెస్టర్లు భారీగా అమ్మకాలు జరపుతుండం వల్ల కొంత మేర రూపాయి పతనం కాకుండా అడ్డుకుందని ట్రేడర్స్‌ అభిప్రాయపడ్డారు. ఇంట్రాడేలో రూపాయి విలువ 77.87 గా ఉంది. తరువాత అతి 78.03కు పడిపోయింది. క్రితం ముగింపుతో పోల్చితే ప్రారంభంలో మారం విలువ 7 పైసలు పెరిగింది. చివరకు డాలర్‌తో రూపాయి మారకం విలువ 77.86 వద్ద ముగిసింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement