Thursday, April 25, 2024

లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారాన్ని లాభాల్లో ప్రారంభించాయి.ఉదయం లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు అంతర్జాతీయంగా మిశ్రమ సంకేతాలకు తోడు విదేశీ మదుపర్ల అమ్మకాల కొనసాగుతుండటంతో లాభాల వైపు పయనించాయి. అయితే, మద్యాహ్నం 2 తర్వాత ఒక్కసారిగా కుప్పకూలిన తర్వాత ‎ఆటో, రియాల్టీ, ఆయిల్ & గ్యాస్ స్టాక్స్ సూచీలకు మద్దతుగా ఉండటంతో మార్కెట్ ముగిసే సమయంలో లాభాలవైపు పయనించాయి. ట్రేడింగ్ ప్రారంభమైనప్పటి నుంచి చివరి వరకు సూచీలు లాభాల్లోనే కొనసాగాయి. ఇన్ఫోసిస్, టీసీఎస్, రిలయన్స్ ఇండస్ట్రీస్, యాక్సిస్ బ్యాంక్ తదితర హెవీ వెయిట్ కంపెనీలు లాభాల్లో ట్రేడ్ కావడం మార్కెట్లపై ప్రభావాన్ని చూపించింది. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 364 పాయింట్లు లాభపడి 52,950కి పెరిగింది. నిఫ్టీ 122 పాయింట్లు పుంజుకుని 15,885కి ఎగబాకింది.

ఇది కూడా చదవండి: టీమిండియా బ్రాండ్ అంబాసిడర్ గా సోనూసూద్..

Advertisement

తాజా వార్తలు

Advertisement