Wednesday, May 15, 2024

Nothing 2A లాంచ్ డేట్ ఫిక్స్‌.. ఫీచర్లు, ధర వివరాలు లీక్.!

ప్ర‌ముఖ చైనా స్మార్ట్‌ఫోన్ కంపెనీ నథింగ్ నుంచి త్వరలో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్‌కి రెడీ అయ్యింది. నథింగ్ ఫోన్ 2ఏ గా మార్కెట్‌లోకి రానున్న ఈ స్మార్ట్‌ఫోన్ లాంచ్ డేట్‌ని తాజాగా కన్ఫామ్ చేసింది కంపెనీ. ఈ మిడ్ రేంజ్ డివైజ్ వచ్చే నెల (మార్చి) 5న ఇండియన్ మార్కెట్ తో పాటు గ్లోబల్ మార్కెట్‌లలోనూ రిలీజ్ కానుంది. కాగా, నథింగ్ ఫోన్ 2ఏ మునుపటి నథింగ్ ఫోన్ 2 మాదిరిగానే కొన్ని ఫీచర్లను కలిగి ఉంటుందని పేర్కొంది.

కాగా, లాంచ్‌కు ముందు కంపెనీ తమ యూట్యూబ్ ఛానెల్‌లో నథింగ్ ఫోన్ 2a గురించి కొన్ని వివరాలను వెల్లడిస్తూ ఒక చిన్న వీడియో రిలీజ్ చేసింది. నథింగ్ 2ఏ మిడ్ రేజ్ స్మార్ట్‌ఫోన్ అయినప్పటికీ.. ఫోన్ సాఫ్ట్‌వేర్, కెమారా అండ్ పర్ఫామెన్స్ ఎక్కడకూడా కాంప్రమైజ్ కాలేదని కింపెనీ వ్యవస్థాపకుడు కార్ల్ పీ తెలిపాడు. నథింగ్ ఫోన్ 2ఎ రోజువారీ స్మార్ట్‌ఫోన్ అనుభవాన్ని అందించేందుకు వీలుగా అనేక ఆకర్షణీయమైన ఫీచర్లతో రానుందని వెల్లడించాడు.

నథింగ్ ఫోన్ 2ఎ లాంచ్ తేదీ, ధర (అంచనా) :

నథింగ్ ఫోన్ 2ఎ ఫోన్ ధర ప్రీమియం వేరియంట్ కన్నా తక్కువగా ఉటుంది. నథింగ్ ఫోన్ 2 భారత మార్కెట్లో రూ. 44,999కి లాంచ్ అయింది. అయితే, టోన్డ్ డౌన్ వెర్షన్ ఫోన్ 2ఎ ధర దాదాపు రూ. 33,200 గా ఉండే అవవాశం ఉంది. నథింగ్ ఫోన్ బ్లాక్, వైట్ అనే రెండు కలర్ ఆప్షన్లలో పొందవచ్చు.

నథింగ్ ఫోన్ 2ఎ స్పెసిఫికేషన్లు లీక్ :

- Advertisement -

నథింగ్స్ ఫోన్ 2ఎతో కంపెనీ అదే డిజైన్ లాంగ్వేజ్‌ని అందించే అవకాశం ఉంది. నథింగ్ ఫోన్ 2ఎ 50ఎంపీ బ్యాక్ కెమెరాతో సహా డ్యూయల్ కెమెరా సిస్టమ్‌ను కలిగి ఉంటుందని సూచిస్తున్నాయి. నథింగ్ ఫోన్ 32ఎంపీ సెల్ఫీ కెమెరాతో పాటు గ్లిఫ్ కంట్రోల్స్ కలిగి ఉంటుంది.

నథింగ్ ఫోన్ 2ఎ ఫోన్ మోడల్ (Visionix), బీఓఈ నుంచి 6.7-అంగుళాల 120హెచ్‌జెడ్ ఓఎల్ఈడీ స్క్రీన్‌ను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. నథింగ్ ఫోన్ 2ఎ ఫోన్ అనేది మీడియా టెక్ డైమెన్సిటీ 7200 చిప్‌సెట్ ద్వారా అందిస్తుంది. ఆర్మ్ మాలి-జీ610 ఎంసీ4 జీపీయూతో పాటు 2ఎక్స్ కార్టెక్స్-ఎ715, 6ఎక్స్ కార్టెక్స్-ఎ510 కోర్లను కలిగి ఉంది.

నథింగ్ ఫోన్ 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజీని కలిగి ఉంటుంది. పవర్ విషయానికి వస్తే.. నథింగ్ ఫోన్ 2ఎ మోడల్ 4,500 ఎంఎహెచ్, 4,800 ఎంఎహెచ్ మధ్య బ్యాటరీ సామర్థ్యాన్ని అందించవచ్చు. ఆపరేటింగ్ సిస్టమ్ (OS) పరంగా నథింగ్ ఫోన్ 2ఎ ఆండ్రాయిడ్ 14 ఆధారంగా నథింగ్ ఓఎస్ 2.5పై రన్ అవుతుందని అంచనా. నథింగ్ ఓఎస్ అనేది క్లీన్, స్మూత్ స్కిన్ కలిగి ఉంటుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement