Sunday, May 5, 2024

అమ్మ‌కానికి ట్విట్ట‌ర్…

శాన్ ఫ్రాన్సిస్కో – ఎంతో మ‌క్కువ‌తో 44 బిలియ‌న్ డాల‌ర్ల‌కు కొనుగోలు చేసిన ట్విట్ట‌ర్ ను ఎలాన్ మ‌స్క్ తాజాగా అమ్మ‌కానికి పెట్టాడు.. ఈ కంపెనీని ఆయ‌న వైట్ ఎలిఫెంట్ గా భావిస్తున్నాడు .. ఇదే విష‌యాన్ని బిబిసికి ఇచ్చిన ఇంట‌ర్వ్యూ లో వెల్ల‌డించాడు.. సరైన వ్యక్తి దొరికితే ట్విట్టర్‌ను విక్రయించనున్నట్లు పేర్కొన్నాడు.. ట్విట్టర్‌ కంపెనీలో నెలకొన్న పరిస్థితులపై, కొనుగోలు అనంతరం అనుభవాలను ఆయన వెల్లడించాడు. ట్విట్టర్‌ను టేకోవర్ చేయడంపై ఆయన సమర్థించుకున్నాడు. సోషల్‌ మీడియా ప్లాట్‌ఫారమ్‌ను కొనుగోలు చేసినందుకు చింతించడం లేదన్నాడు. ట్విట్ట‌ర్ ను టేకోవ‌ర్ చేసుకున్న వెంట‌నే ఆ సంస్థ సిఈవో ప‌రాగ్ తో స‌హా టాప్ ఎగ్జిక్యూటీవ్స్ ను ఇంటికి పంపేశాడు.. అలాగే 35 శాతం ఉద్యోగాల‌కు బైబై చెప్పాడు.. తాజాగా ట్వ‌ట్ట‌ర్ ను కొన‌సాగించ‌లేనంటూ సైలెంట్ గా మూడో కంటికి తెలియకుండా మరో కంపెనీలో విలీనం చేశాడు. ఎక్స్ అనే ఎవ్రీథింగ్ యాప్‌లో ట్విట్టర్‌ను కలిపేసినట్టు ప్ర‌కటించాడు ఎలాన్ మ‌స్క్.. ఇప్పుడు ఏకంగా ట్విట్ట‌ర్ నే ఆమ్మేందుకు సిద్ద‌మ‌య్యాడు.. దీనిపై నెటిజెన్లు మండిప‌డుతున్నారు.. ఎందుకు కొన్న‌ట్లు… ఎందుకు అమ్ముతున్న‌ట్లు అంటూ నిల‌దీస్తున్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement