Wednesday, May 1, 2024

కొత్త బస్సుల కొనుగోలు దిశగా ఆర్టీసీ యత్నాలు.. వాణిజ్య సంస్థల నుంచి రుణాల సేకరణ

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్సార్టీసీ)కు త్వరలో మరిన్ని కొత్త్త బస్సులు రానున్నాయి. వాస్తవానికి కిందటి సంవత్సరం చివరలోనే సంస్థకు కొత్త బస్సులు అందాయి. వీటికి తోడు తాజాగా… ప్రయాణికుల రద్దీ (ఆక్యుపెన్సీ రేషియో) ఇటీవలి కాలంలో గణనీయంగా మెెరుగుపడడంతో… తాజాగా మరిన్ని బస్సులను కొనుగోలు చేయాలని ఆర్టీసీ భావిస్తోంది. ఇటీవలి కాలంలో సంస్థ ఓఆర్‌ గణనీయంగా మెరుగుపడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కొత్త బస్సుల కొనుగోలు దిశగా యాజమాన్యం దృష్టి సారించింది. అయితే… కొత్త బస్సుల కొనుగోలుకు నిధుల లేమి అడ్డంకిగా మారింది. ఇప్పటికిప్పుడు కనీసం 200 కొత్త బస్సులు కొనాలన్నా కూడా సంస్థకు కనీసం రూ. 100 కోట్ల మేరకైనా అవసరం పడుతుంది. అటు ఆర్టీసీకి రుణాలనిచ్చేందుకు బ్యాంకులు పెద్దగా ఆసక్తిని ప్రదర్శించడంలేదు. దీంతో ప్రభుత్వం నొంచి ఆర్ధికసాయాన్ని పొదాలన్న దిశగా సంస్థ యోచిస్తోంది. ఈ క్రమంలోనే… రవాణా శాఖా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌తో ఆర్టీసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సజ్జనార్‌ చర్చించనున్నట్లు ఆర్టీసీ వర్గాలు చెబుతున్నాయి.

ఈ క్రమంలోనే…. త్వరలో వీరిరువురి మధ్య త్వరలో భేటీ జరగనున్నట్లు వినవస్తోంది. వాస్తవానికి సాధారణ బస్సులనే ఇప్పటివరకు కొనుగోలు చేసిన ఆర్టీసీ… ఇప్పుడు పూర్తిగా లగ్జరీ బస్సుల కొనుగోలుకే మొగ్గుచూపుతోంది. మంత్రి అజయ్‌కుమార్‌తో సంస్థ ఎండీ సజ్జనార్‌ ఇప్పటికేకే ఈ ప్రతిపాదనను సూచనప్రాయంగా చర్చించినట్లు వినవస్తోంది. మొత్తంమీద… అటు బ్యాంకులతోపాటుపాటు ఇతరత్రా ఆర్ధిక సంసప్థల నుంచి కూడా రుణాలను సేకరించాలని ఆర్టీసీ యోచిస్తున్నట్లు వినవస్తోంది. ఈ క్రమంలోనే… ఐడీబీఐ(ఇండస్ట్రియల్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా), ఐఎఫ్‌సీఐ(ఇండస్ట్రియల్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా), ఐసీఐసీఐ(ఇండస్ట్రియల్‌ క్రెడిట్‌ అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా) తదితర వాణిజ్య బ్యాంకుల నుంచి కూడా రుణాలను పొందేందుకు ఆర్టీసీ యాెెచిస్తున్నట్లు సంస్థ వర్గాల నుంచి వినవస్తోంది. ఇప్పటివరకు సాంప్రదాయకంగా వస్తున్న ప్రక్రియ మేరకు… బ్యాంకుల నుంచే ఆర్టీసీ రుణాలను సమకూర్చుకుంటూ వస్తోంది. అయితే సంస్థ స్థితిగతుల నేపథ్యంలో… ఆర్టీసీకి రుణాలను సమకూర్చేందుకు బ్యాంకులు పెద్దగా సుముఖత వ్యక్తం చేయడంలేదు. దీంతో ఇతర మార్గాల వేపు దృష్టి సారించడం ఆర్టీసీకి అనివార్యంగా మారింది. ఈ నేపథ్యంలోనే… ఐడీబీబీఐ, ఐఎఫ్‌సీఐ, ఐసీఐసీఐ వంటి వాణిజ్య సంస్థల వేపు సంస్థ దృషఫ్టి సారించినట్లు వినవస్తోంది.

అయితే ఆయా సంస్థలు రుణాలు మంజూరు చేయాలంటే రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ) అనుమతి తప్పనిసరి. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ క్రమంలో… ఆర్టీసీ యాజమాన్యం చేస్తోన్న ప్రతిపాదనల విషయమై ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు చెబుతున్నారు. గతంలో ఆర్టీసీకి ప్రభుత్వం నేరుగా ఆర్ధికసాయాన్నందించిన సందర్భాలున్నాయి కూడా. అయితే… వివిధ పథకాలు, కార్యక్రమాల నేపథ్యంలో… ఆర్టీసీకి మళ్ళీ ఆర్ధిక సహకారాన్నందించేందుకు ప్రభుత్వం యోచించాల్సిన పరిస్థితి నెలకొంది. మొత్తంమీద… ఈ పరిస్థితుల నేపథ్యంలో… ఐడీబీఐ, ఐఎఫ్‌సీఐ, ఐసీఐసీఐ తదితర సంస్థల నుంచి రుణసాయాన్ని పొందాలన్న ప్రతిపాదనలు తెరమీదకు వచ్చాయి. ఇందుకు సంబంధించి గ్యారంటీగా నిలిచేందుకు సూచనప్రాయంగా అంగీకరించినట్లు సంస్థ వర్గాలు చెబుతున్నాయి. ఈ పరిణామాలన్నీ ఓ కొలిక్కి వచ్చినపక్షంలో… ఆర్టీసీ త్వరలోనే కొత్త బస్సులను సమకూర్చుకునేందుకు మార్గం సుగతమమవుతుందని సంస్థ వర్గాలు పేర్కొంటున్నాయి.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement