Friday, May 17, 2024

రిటైర్‌ అయిన పైలట్లకు తిరిగి ఉద్యోగాలు : ఎయిర్ ఇండియా

రిటైర్‌ అయిన పైలట్లను తిరిగి ఉద్యోగంలోకి తీసుకోవాలని టాటా గ్రూప్‌కు చెందిన ఎయిర్‌ ఇండియా నిర్ణయించింది. 65 సంవత్సరాల లోపు వారికి 5 సంవత్సరాల కాలపరిమితితో తిరిగి ఉద్యోగంలోకి తీసుకోనున్నారు. కొత్తగా పెద్ద సంఖ్యలో విమానాలు కొనుగోలు చేయాలని నిర్ణయించిన ఎయిర్‌ ఇండియా పైలట్ల కొరత లేకుండా ఈ చర్య తీసుకుంది. ఎయిర్‌ ఇండియాను టాటా గ్రూప్‌ కొనుగోలు చేసిన తరువాత సంస్థలో పని చేస్తున్న పైలట్లకు స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకు వచ్చింది. ఇప్పుడు మూడు సంవత్సరాల క్రితం నుంచి పదవీ విరమణ చేసిన వారికి తిరిగి తీసుకుంటామని ప్రకటించింది. దేశీయ విమానాలు నడిపేందుకు తగినంత మంది పైలట్లు అందుబాటులో లేరు. ఈ కొరతను దృష్టిలో పెట్టుకునే టాటా గ్రూప్‌ రిటైర్‌ అయిన పైలట్లకు మళ్లి ఉద్యోగాలు ఆఫర్‌ చేస్తోంది.

ఎయిర్‌ క్రాఫ్ట్‌ నిర్వాహణ సిబ్బంది, క్యాబిన్‌ క్రూ, ఇంజనీర్లతో వేతనాలతో పోల్చితే పైలట్ల వేతనాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకే ఎయిర్‌ ఇండియా కొత్త వారి బదులు, రిటైర్‌ అయిన వారిని మళ్లి తీసుకోవాలని నిర్ణయించింది. ప్రభుత్వ రంగంలో ఉన్న సమయంలో ఎయిర్‌ ఇండియా పైలట్ల రిటైర్మెంట్‌ వయస్సు 58 సంవత్సరాలుగా ఉంది. ప్రయివేట్‌ ఎయిర్‌ లైన్స్‌ లో మాత్రం రిటైర్మెంట్‌ వయస్సు 65 సంవత్సరాలుగా ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే సంస్థలో మూడు సంవత్సరాలుగా రిటైర్‌ అయిన పైలట్లకు ఆసక్తి ఉంటే ఉద్యోగంలో చేరాల్సిందిగా సమాచారం ఇచ్చింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement