Friday, May 3, 2024

నికాన్‌ నుంచి నికార్‌ లెన్స్‌ విడుదల

హైదరాబాద్‌, (ప్రభ న్యూస్‌) : కెమెరాల తయారీ కంపెనీ నికాన్‌ తక్కువ వెయిట్‌ ఉండేలా అల్ట్రా వైడ్‌ యాంగిల్‌ జూమ్‌ లెన్స్‌ నికార్‌ జెడ్‌ 17-28 ఎంఎంను ఆవిష్కరించింది. ఈ లెన్స్‌ ఎఫ్‌/2.8 అపార్చర్‌ నుంచే పనిచేస్తుందని కంపెనీ వెల్లడించింది. ఈ లెన్స్‌ ఆఫర్‌ చేస్తున్న ఫోకల్‌ లెంత్‌ను బట్టి, వివిధ రకాల సీన్స్‌ను మరో లెన్స్‌కు మారకుండానే క్యాప్చర్‌ చేయడం కుదురుతుందని నికాన్‌ తెలిపింది. నికార్‌ జెడ్‌ 17-28 ఎంఎం.ఎఫ్‌/2.8 లెన్స్‌తో 4కే వీడియో రికార్డింగ్‌ కూడా చేసుకోవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement