Friday, May 3, 2024

ఏప్రిల్‌ 1 నుంచి క్రెడిట్‌ కార్డుల కొత్త రూల్స్‌

కొత్త ఆర్ధిక సంవత్సరంలో క్రెడిట్‌ కార్డుల విషయంలో కొన్ని మార్పులు రానున్నాయి. ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, యస్‌ బ్యాంకక్‌ వంటి ప్రధాన బ్యాంక్‌లు లాంజ్‌ యాక్సెస్‌, రివార్డ్‌ పాయింట్ల విషయంలో మార్పులు తీసుకు వస్తున్నాయి. దీనిపై ఆయా బ్యాంక్‌లు కార్డుదారులకు సమాచారం అందించాయి.

ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్‌ ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డుల రివార్డ్‌ పాయింట్ల విధానంలో మార్పులు చేసింది. ఇప్పటి వరకు అద్దె చెల్లింపులపై రివార్డ్‌ పాయింట్లను అందిస్తున్న బ్యాంక్‌ ఇకపై ఈ చెల్లింపులకు రివార్డు పాయింట్లను నిలిపివేసింది. ఏప్రిల్‌ 1 నుంచి ఈ నిబంధనలు వర్తించనున్నాయి. ఎస్‌బీఐ అందిస్తున్న అన్ని అరుమ్‌, ఎస్‌బీఐ కార్ట్‌ ఎలైట్‌, సింప్లీ క్లిక్‌ కార్డులు వినియోగిస్తున్న వారికి ఈ కొత్త నిబంధన వర్తించ నుంది.

ఐసీఐసీఐ బ్యాంక్‌ కూడా కాంప్లిమెంటరీ ఎయిర్‌పోర్ట్‌ లాంజ్‌ యాక్సెస్‌ విషయంలో నిబంధనలను సవరించింది. రానున్న త్రైమాసికంలో ఈ సదుపాయం పొందాలంటే అంతకు ముందు త్రైమాసికంలో కనీసం 35,000 ఖర్చు చేయాల్సి ఉంటుంది. కోరల్‌ క్రెడిట్‌ కార్డు, మేక్‌ మై ట్రిప్‌, ప్లాటినం క్రెడిట్‌ కార్డుతో పాటు అన్ని రకాల కార్డులకు ఈ నిబంధన వర్తిస్తుందని తెలిపింది. యస్‌ బ్యాంక్‌ కూడా లాంజ్‌ యాక్సెస్‌లో నిబంధనలను సవరించింది.

అంతకు ముందు త్రైమాసికంలో 10,000 వ్యయం చేసిన వారికి లాంజ్‌ యాక్సెస్‌ ఇవ్వనుంది. యాక్సిస్‌ బ్యాంక్‌ మాగ్నస్‌ క్రెడిట్‌ కార్డుపై రివార్డ్‌ పాయింట్ల, లాంజ్‌ యాక్సెస్‌తో పాటు వార్షిక రుసుములో కీలక మార్పులు చేసింది. బీమా, గోల్డ్‌ ఆభరణాలు, ఇంధనం కోసం క్రెడిట్‌ కార్డు ద్వారా జరిపే చెల్లింపులపై ఇక నుంచి ఎలాంటి రివార్డు పాయింట్ల ఇవ్వడంలేదని తెలిపింది.

ఎయిర్‌ పోర్టు లాంజ్‌ యాక్సెస్‌ పొందాలంటే మూడు నెలల్లో కనీసం 50,000 ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఒక క్యాలెండర్‌ సంవత్సరంలో దేశీయ, అంతర్జాతీయ లాంజ్‌ల్లోకి కాంప్లిమెంటరీ గెస్ట్‌ సందర్శనల సంఖ్యను కూడా ఏడాదికి 8 నుంచి 4కు తగ్గించింది. ఏప్రిల్‌ 20 నుంచి కొత్త మార్పులు అమల్లోకి వస్తాయని యాక్సెస్‌ బ్యాంక్‌ తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement