Sunday, April 28, 2024

టాటా గ్రూప్‌ నుంచి కొత్తగా పేమెంట్‌ యాప్‌.. వచ్చే నెలలో ప్రారంభం

భారతదేశంలో డిజిటల్‌ పద్దతిలో పేమెంట్స్‌ చేయడం విస్తృతమైంది. డిజిటల్‌ పేమెంట్‌ ఆధారిత సర్వీస్‌ ప్రొవైడర్లు ప్రస్తుతం దేశ్యవాప్తంగా అత్యంత ప్రజాదరణను పొందాయి. ఈక్రమంలో టాటా గ్రూప్‌ సంస్థ కూడా ఈ రంగంలోకి అడుగుపెట్టనుంది. ది ఎకనామిక్‌ టైమ్స్‌ యొక్క నివేదిక ప్రకారం టాటా గ్రూప్‌ సంస్థ దేశంలో తన స్వంత యునైటెడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌ ఆధారిత డిజిటల్‌ పేమెంట్‌ సర్వీసును అందుబాటులోకి తీసుకురానుంది. దీనికోసం నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా నుండి క్లియరెన్స్‌ కోరుతోంది. థర్డ్‌ పార్టీ అప్లికేషన్‌ ప్రొవైడర్స్‌గా పనిచేయడానికి టాటా గ్రూప్‌ దరఖాస్తు చేసిందని మరియు వచ్చే నెలలో ఈ సర్వీసును ప్రారంభించాలని యోచిస్తున్నట్లు కొత్త నివేదిక పేర్కొంది.

భారతదేశంలో పేమెంట్‌ ప్లాట్‌ఫారమ్‌లను అందించడానికి అమెజాన్‌ పే, వాట్సాప్‌ పే మరియు గూగుల్‌ పే వంటి నాన్‌బ్యాంకింగ్‌ పేమెంట్ల ప్లాట్‌ఫారమ్‌లు బ్యాంకులతో భాగస్వామ్యం కలిగి ఉండాలి. ఈ కంపెనీలు కూడా సాధారణంగా బహుళ భాగస్వాములను కలిగి ఉండటానికి మొగ్గుచూపుతాయి. తద్వారా వారి నెట్‌వర్క్‌పై ఒత్తిడి పెరిగినప్పుడు పేమెంట్లు భాగస్వామి కంపెనీల అంతటా పంపిణీ అవుతాయి. ఈ సర్వీసును ఉపయోగిస్తున్నప్పుడు వినియోగదారులు అంతరాయాన్ని ఎదుర్కోకుండా కూడా ఇది సహకరిస్తుంది. దీని కోసం టాటా గ్రూప్స్‌ డిజిటల్‌ కామర్స్‌ వింగ్‌, టాటా డిజిటల్‌ కలిసి భారతదేశంలో తన స్వంత డిజిటల్‌ పేమెంట్‌ ప్లాట్‌ఫామ్‌ను శక్తిమంతం చేయడానికి ప్రయత్నిస్తోంది.

ఈ కంపెనీ తన డిజిటల్‌ పేమెంట్‌ ప్లాట్‌ఫారమ్‌ను బలోపేతం చేయడానికి మరొక ప్రధాన ప్రైవేట్‌ రంగ బ్యాంకింగ్‌ భాగస్వామితో కూడా చర్చలు జరుపుతోందని సమాచారం. వచ్చే నెల టాటా గ్రూప్‌ తన సూపర్‌ యాప్‌ను ‘టాటా న్యూ’ పేరుతో విడుదల చేయాలనే ఆలోచనలో ఉంది. కొత్త ప్రణాళికలతో ఖరారు చేసిన సమయంలోనే దీనిని అభివృద్ధి చేయాలని సంస్థ యొక్క వ్యూహం. ”టాటా న్యూ లాంచ్‌ అయ్యే సమయానికి వారు (టాటా గ్రూప్‌) దీనిని సిద్ధంగా ఉంచాలని యత్నిస్తుంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలను ఏప్రిల్‌ 7న టాటా డిజిటల్‌ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement