Monday, May 6, 2024

Mumbai – స్టాక్‌ మార్కెట్లు ఢమాల్ – నేడు మూడు లక్షల కోట్ల సంపద ఆవిరి

ముంబై ,- దేశీయ స్టాక్‌ మార్కెట్లు బుధవారం భారీగా పతనమయ్యాయి. బుధవారం స్వల్ప నష్టాలతో మొదలైన స్టాక్‌ మార్కెట్లు ఏ దశలోనూ కోలుకోలేదు. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న ప్రతికూల పవనాలతో.. దేశీయ మార్కెట్లలో బుధవారం భారీగా అమ్మకాలు కనిపించాయి.

ఈ క్రమంలో బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజ్ సెన్సెక్స్ దాదాపు 800 పాయింట్లు తగ్గి 67వేల మార్క్‌ దిగువకు పడిపోయింది. ట్రేడింగ్‌లో 66,728 పాయింట్ల కనిష్ఠ స్థాయిని తాకింది. అదే సమయంలో నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ 238 పతనమై 19,895 పాయింట్లకు చేరుకుంది.

చివరకు సెన్సెక్స్‌ 796 పాయింట్లు తగ్గి 66,800.84 పాయింట్ల వద్ద స్థిరపడగా.. నిఫ్టీ 231.90 పాయింట్లు పతనమై 19,901.40 వద్ద ముగిసింది. బీఎస్‌ఈలో లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.2.95 లక్షల కోట్లు తగ్గి రూ.320.04 లక్షల కోట్లకు చేరింది. .. దీంతో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్ వంటి ప్రధాన స్టాక్స్‌లో నష్టాలు 16 సంవత్సరాల గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. జేఎస్‌డబ్ల్యూ స్టీల్, మారుతీ, అల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు క్షీణించాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement