Sunday, May 19, 2024

ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌, వ్యాల్యూ డిస్కవరీ ఫండ్‌.. 18 ఏళ్లలో 10లక్షలకు 2.50కోట్లు..

ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ వ్యాల్యూ డిస్కవరీ ఫండ్‌ కింద 18 ఏళ్ల క్రితం రూ.10లక్షలు పెట్టుబడిపెడితే.. ప్రస్తుతం దాని విలువ రూ.2.50 కోట్లకు చేరింది. ఈక్విటీ మార్కెట్లు గత కొన్ని నెలలుగా స్థిరత్వాన్ని ప్రదర్శించడం లేవు. భౌగోళికంగా ఉద్రిక్త పరిస్థితులు, ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న ద్రవ్యోల్బణం, గ్లోబల్‌ సెంటర్‌ బ్యాంక్స్‌ ట్యాపర్‌ వంటి అంశాలు.. మార్కెట్లు అస్థిరత ప్రదర్శించడానికి ప్రధాన కారణాలు. ఈ సందర్భంగా లీడింగ్‌ ఫండ్‌ మేనేజర్‌ ఎన్‌ నరేనిస్‌ మాట్లాడుతూ.. మార్కెట్లలో ఆందోళనకరమైన పరిస్థితులు నెలకొన్నాయి. రానున్న కాలంలో కూడా మార్కెట్లు ఎలా ఉంటాయనేది ఇన్వెస్టర్లు ఎవరూ అంచనా వేయలేరు. అయితే ప్రస్తుతం మార్కెట్‌లో కనిపిస్తున్న కరెక్షన్‌ను పెట్టుబడులకు అనుకూలంగా మార్చుకోవాలి. రానున్న 12-18 నెలల పాటు మంచి లాభాలు పొందేందుకు ఈ కరెక్షన్‌ ఎంతో దోహదం చేస్తుంది. భారత్‌ మార్కెట్‌.. దీర్ఘ కాల పెట్టుబడిదారులకు ఎంతో సానుకూలంగా ఉంటుంది. అందుకే ఈక్విటీ పెట్టుబడిదారులు దీర్ఘ కాలిక అంశాలపై దృష్టి సారిస్తే బాగుంటుంది. మార్కెట్‌ అస్థిరతను అందిపుచ్చుకోవాలి. సెప్టెంబర్‌ 2020 వరకు విలువ అనుకూలంగా లేదు. ఇది 1988-89, 2007-2008 సమయంలో ఇదే పరిస్థితి ఉండింది. కరోనా మహమ్మారి తీవ్రత తగ్గుముఖ పట్టడంతో.. ఈ విలువ వెలుగులోకొచ్చింది. వడ్డీ రేట్లు గరిష్ట స్థాయికి చేరుకోవడానికి సిద్ధంగా ఉన్న సమయంలో.. చమురు ధర స్థిరంగా ఉన్నట్టు కనిపిస్తోంది. లోహాలు, ఇంధనం, బొగ్గు వంటి అనేక ముఖ్యమైన పరిశ్రమలపై అవగాహన ఉన్న పెట్టుబడిదారులలో ఆసక్తి పెరిగింది.

ఇవి తప్పనిసరిగా మునుపటి మార్కెట్‌ ర్యాలీ సమయంలో పెద్ద ట్రాక్షన్‌ను చూడని రంగాలు. ఆర్థిక వ్యవస్థ ఊపందుకోవడంతో.. ఆర్థిక వ్యవస్థ పునరుజ్జీవం పొందుతున్నందున వ్యాల్యూ ఫండ్స్‌ బలమైన పునరాగమనం కోసం సెట్‌ చేయబడుతాయని విస్తృతంగా అంచనా వేయబడింది. ద్రవ్యోల్బణం సమయంలో.. వ్యాల్యూ ఇన్వెస్టింగ్‌ బాగా పని చేస్తుంది. మార్కెట్‌ ఎలివేట్‌ అయిన సమయంలో.. వ్యాల్యూ ఇన్వెస్టింగ్‌ చేయడంతో బాగుంటుందని, అయితే దీర్ఘకాల విలువను కలిగి ఉన్న రంగాలలో పెట్టుబడి పెట్టడంపై విలువ దృష్టి సారిస్తుంది. దీర్ఘ కాలిక లక్ష్యాలను చేరుకోవడానికి వ్యాల్యూ ఫండ్స్‌ ఎంతో బాగుంటాయి. ప్రతీ నెలా రూ.10వేలు ఆగస్టు 2004 నుంచి సిప్‌ చేస్తుంటే.. రూ.72 లక్షలకు.. రూ.1.1 కోట్ల రిటర్న్స్‌ వస్తాయి. ఒకేసారి రూ.10లక్షలు చేస్తే.. దాని విలువ ఇప్పుడు రూ.2.50కోట్లు. 10 నుంచి 15 ఏళ్ల పాటు ఫండింగ్‌లో మూడు మెరుగైన లాభాలు అందిస్తాయి. అందులో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ వ్యాల్యూ డిస్కవరీ ఫండ్‌, నిప్పాన్‌ ఇండియా వ్యాల్యూ ఫండ్‌, ఇన్వెస్కో ఇండియా కాంట్రా ఫండ్‌.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement