Friday, May 17, 2024

Samsung Galaxy | శాంసంగ్‌ ఎస్‌23పై మోడ‌ల్స్‌పై భారీ డిస్కౌంట్‌..!

టెక్ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న Samsung Unpacked ఈవెంట్ జనవరి 17న ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా త‌మ కంపెనీ నుంచి S24 సిరీస్ ఫోన్‌లను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా, ఈ మోడల్‌ను విడుదల చేయడానికి ముందు, Samsung తమ‌ పాత సిరీస్ S23 మోడల్ ధరలను తగ్గించింది.

గెలాక్సీ ఎస్‌23 8GB+128GB వేరియంట్ ధర రూ.74,999. 8GB+256GB వేరియంట్ ధర రూ.79,999 కాగా, ఈ రెండు మోడ‌ల్స్‌ను రూ.10వేల డిస్కౌంట్‌తో రూ.64,999 & రూ.69,999కే విక్రయిస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13తో OneUI 5.1తో వస్తుంది. 50MP ప్రధాన కెమెరా, 12MP ఫ్రంట్ కెమెరా, 3900mAh బ్యాటరీ.

గెలాక్సీ ఎస్‌23 ప్లస్ వేరియంట్లపై కూడా ఈ డిస్కౌంట్ వ‌ర్తిస్తొంది. గెలాక్సీ ఎస్‌23 ప్లస్ 8జీబీ+256 జీబీ వేరియంట్‌ ఫోన్‌ ధర రూ.94,999 కాగా, తగ్గింపుతో రూ.84,999కే అందిస్తోంది. ఇక 8జీబీ+512 జీబీ వేరియంట్‌ ధర రూ.1,04,999 కాగా.. రూ.94,999కే కొనుగోలు చేయొచ్చని శాంసంగ్‌ పేర్కొంది. ఆండ్రాయిడ్‌ 13 ఓఎస్‌, 50 ఎంపీ ప్రధాన కెమెరా, ముందు వైపు 12 ఎంపీ కెమెరా, 4700mAh బ్యాటరీ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

- Advertisement -

ఈ స్మార్ట్‌ఫోన్ శామ్‌సంగ్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వెబ్‌సైట్లలో ఎన్నడూ లేనంత తక్కువ ధరకు అందుబాటులో ఉంది. బ్యాంక్ ఆఫర్‌లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లతో దీన్ని మరింత చౌకగా కొనుగోలు చేయవచ్చు. యాక్సిస్ బ్యాంక్ సిగ్నేచర్ క్రెడిట్ కార్డ్ సహాయంతో ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేస్తే, మరో రూ.2,500 తగ్గింపు ఉంటుంది. అదే యాక్సిస్ బ్యాంక్ ఇన్ఫినిటీ క్రెడిట్ కార్డ్ ద్వారా రూ.5 వేలు తగ్గింపు పొందవచ్చు. అంటే రూ.15 వేల వరకు తగ్గింపుతో ఈ ఫోన్లను కొనుగోలు చేయవచ్చు.

Advertisement

తాజా వార్తలు

Advertisement