Friday, April 26, 2024

ప్రపంచంలో తొలి రిటైల్‌ స్టోర్‌ను ప్రారంభించిన గూగుల్‌

టెక్ దిగ్గ‌జం గూగుల్ కూడా ఆపిల్ బాట ప‌ట్టింది. త‌న తొలి రిటైల్ స్టోర్‌ను ప్రారంభించింది. అమెరికాలోని న్యూయార్క్ న‌గ‌రంలో హార్డ్‌వేర్ ప్రోడ‌క్ట్స్‌తో ఈ స్టోర్‌ను లాంచ్ చేసింది. చెల్సీ ప్రాంతంలో 5 వేల చ‌ద‌ర‌పు అడుగుల స్థ‌లంలో ఈ స్టోర్ కస్ట‌మ‌ర్ల ముందుకు వ‌చ్చింది. ఇందులో గూగుల్ త‌యారు చేసిన అన్ని హార్డ్‌వేర్‌, సాఫ్ట్‌వేర్ ప్రోడ‌క్ట్స్ అందుబాటులో ఉంటాయి. పిక్సెల్ ఫోన్లు, స్టేడియా, వేర్ఓఎస్‌, ఫిట్‌బిట్ డివైజ్‌లు, పిక్సెస్‌బుక్స్ వంటివ‌న్నీ ఉన్నాయి. ఈ స్టోర్ గురించి శుక్ర‌వారం ఆల్ఫాబెట్, గూగుల్ సీఈవో సుంద‌ర్ పిచాయ్ ట్వీట్ చేశారు.

ప్ర‌పంచంలో ఎల్ఈఈడీ ప్లాటినం రేటింగ్‌లు ఉన్న 215 స్టోర్ల‌లో త‌మ‌ది కూడా ఒక‌టని, త‌మ గూగ‌ుల్ స్టోర్‌ను సంద‌ర్శించిన అంద‌రికీ కృతజ్ఞ‌త‌ల‌ు అంటూ ట్వీట్‌లో పిచాయ్ అన్నారు. న్యూయార్క్ వెళ్లిన‌ప్పుడు తాను క‌చ్చితంగా స్టోర్‌ను సంద‌ర్శిస్తాన‌ని చెప్పారు. ఇక్క‌డ గ‌తంలో ఒక పోస్ట్ ఆఫీస్‌, స్టార్‌బ‌క్స్ ఉండేవి. ఐఫోన్‌ల రిపేర్ కోసం ఆపిల్ స్టోర్ల‌కు వెళ్లిన‌ట్లే పిక్సెల్ ఫోన్ల రిపేర్ కోసం ఈ గూగుల్ స్టోర్లకు వెళ్ల‌వ‌చ్చు.

Advertisement

తాజా వార్తలు

Advertisement