Monday, December 9, 2024

ఎల్‌ఐసీ స్టాక్‌, ఇన్వెస్టర్లకు గుడ్‌ న్యూస్‌.. 30వ తేదీన డివిడెంట్‌ ప్రకటన..

భారతదేశంలోని అతిపెద్ద ఇన్సూరెన్స్‌ కంపెనీ.. లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఎల్‌ఐసీ) తమ ఇన్వెస్టర్లకు తీపి కబురు అందించనుంది. ఎల్‌ఐసీ షేర్లు కొనుగోలు చేసి నష్టాల్లో ఉన్న వారిని ఆదుకునేందుకు డివిడెంట్‌ కూడా ప్రకటించేందుకు నిర్ణయించింది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆర్థిక ఫలితాలను మే 30న ప్రకటించేందుకు ఎల్‌ఐసీ నిర్ణయించింది. స్టాక్‌ మార్కెట్‌కు ఇచ్చిన సమాచారంలో.. జీవిత బీమా సంస్థ మొత్తం ఆడిట్‌ చేసిన ఫలితాలు, త్రైమాసిక ఫలితాలు, కంపెనీ పనితీరుకు సంబంధించిన ఫలితాలు మే 30న వెల్లడించేందుకు నిర్ణయించింది. కంపెనీలో డైరెక్టర్ల బోర్డు.. డివిడెంట్‌ చెల్లించాలని నిర్ణయించుకుంటే.. అదే రోజు దీనిపై ప్రకటన ఉంటుంది. మే 17న స్టాక్‌ మార్కెట్‌లో ఎల్‌ఐసీ లిస్ట్‌ అయ్యింది. దీని ఇష్యూ ధర రూ.949 నిర్ణయించగా.. లిస్టింగ్‌కు వచ్చే సమయానికి 9 శాతం నష్టంతో.. రూ.818 వద్ద మార్కెట్‌లోకి వచ్చింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement