Monday, April 29, 2024

స్మార్ట్ ఫోన్​ లవర్స్​కి గుడ్​ న్యూస్​.. రెండ్రోజుల్లో అయిదు కొత్త మోడల్స్ రిలీజ్​!​

స్మార్ ఫోన్ ల‌వ‌ర్స్ కి గుడ్ న్యూస్.. ఈ నెల (అక్టోబర్) 4వ తేదీన ఏకంగా ఐదు స్మార్ట్‌ఫోన్లు మార్కెట్ లో లాంచ్ అయ్యేందుకు రెడీగా ఉన్నాయి. గూగుల్ తో పాటు వివో, శాంసంగ్ పంపెనీలు క‌లిపి మెత్తంగా ఐదు కొత్త ఫోన్ ల‌ను రిలీజ్ చేయ‌నున్నాయి. మ‌రి ఆ వివ‌రాలు ఏమిటో ఓ లుక్కేద్దాం..

శాంసంగ్ ఎస్23 ఎఫ్ఈ..

శాంసంగ్ గెలాక్సీ.. త‌మ కంపెనీ నుంచి ఎస్23 ఎఫ్ఈ స్మార్ట్‌ఫోన్‌ను అక్టోబర్ 4న విడుదల చేయనుంది. ఇక‌ ఇప్పటివరకు సోష‌ల్ మాడియాలో వచ్చిన లీక్‌ల ప్రకారం లాంచ్ కానున్న‌ ఎస్23 ఎఫ్ఈ స్మార్ట్‌ఫోన్ 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్, 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్‌ల్లో లాంచ్ చేయవచ్చు.

- Advertisement -

ఇందులో ప్రారంభ వేరియంట్ ధర రూ.54,999గానూ, టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ.59,999గానూ ఉండే అవకాశం ఉంది. ఇందులో 120Hz రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేసే 6.3 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ పంచ్ హోల్ డిస్‌ప్లే ఉన్న‌ట్ట‌తు తెలుస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 లేదా ఎక్సినోస్ 2200 చిప్‌సెట్‌పై పని చేసే అవకాశం ఉంది.

గూగుల్ పిక్సెల్ 8 సిరీస్..

గూగుల్ పిక్సెల్ 8 సిరీస్‌ను అక్టోబర్ 4వ తేదీన కంపెనీ విడుదల చేయనుంది. ఈ సిరీస్‌లో గూగుల్ పిక్సెల్ 8, గూగుల్ పిక్సెల్ 8 ప్రో స్మార్ట్‌ఫోన్‌లు మార్కెట్లో లాంచ్ కానున్నాయి. ప్రారంభ మోడల్‌లో మీరు డ్యూయల్ కెమెరా సెటప్‌ను పొందుతారు. ప్రో మోడల్‌లో 48 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్‌ ఉండనుంది.

మొత్తంగా ట్రిపుల్ కెమెరా సెటప్‌ను పొందుతారు. లీక్‌ల ప్రకారం ఈసారి ప్రో మోడల్ ధర 100 డాలర్లు ఎక్కువగా ఉండవచ్చు. భారతదేశంలో ఈ సిరీస్ ధర రూ. 65,000 నుంచి ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. ఇక టాప్ ఎండ్ ప్రో మోడల్ ధర దాదాపు రూ. 90,000 వరకు ఉండవచ్చు.

వివో వీ29 సిరీస్..

గూగుల్‌తో పాటు వివో కూడా ఈ రోజున వివో వీ29 సిరీస్‌ను లాంచ్ చేయనుంది. ఈ ఫోన్ లో వెనకవైపు ట్రిపుల్ కెమెరా సెటప్‌ను ఉండ‌నుంది. కంపెనీ యూట్యూబ్ ఛానెల్ ద్వారా మొబైల్ ఫోన్ లాంచ్ ఈవెంట్‌ను లైవ్ చూడగలరు.

మొత్తంగా అక్టోబర్ 4వ తేదీన లాంచ్ అయ్యే ఫోన్లు…

  1. వివో వీ29 (Vivo V29)
  2. వివో వీ29 ప్రో (Vivo V29 Pro)
  3. గూగుల్ పిక్సెల్ 8 (Google Pixel 8)
  4. గూగుల్ పిక్సెల్ 8 ప్రో (Google Pixel 8 Pro)
  5. శాంసంగ్ గెలాక్సీ ఎస్23 ఎఫ్ఈ (Samsung Galaxy S23 FE)
Advertisement

తాజా వార్తలు

Advertisement