Friday, May 3, 2024

టెలిగ్రామ్‌లో ఫేస్‌బుక్‌ తరహా సేవలు

టెలిగ్రామ్‌ యాప్‌లో మెసేజింగ్‌తో పాటు ఫోటోలు, వీడియోలు, డాక్యుమెంట్లను ఇతరులతో షేరు చేసుకోవచ్చు. యూజర్ల గోప్యత కోసం సీక్రెట్‌ చాట్‌ ఫీ చర్‌ కూడా ఉంది. తాజాగా మరో కొత్త ఫీచర్‌ను యాజర్లకు పరిచయం చేయనున్నట్లు టెలిగ్రామ్‌ సీఈఓ పావెల్‌ దురోవ్‌ తెలిపారు. ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ తరహాలో టెలిగ్రామ్‌లో కూడా స్టోరీస్‌ ఫీచర్‌ను తీసుకు వస్తున్నట్లు ప్రకటించారు. టెలిగ్రామ్‌లో స్టోరీస్‌ ఫీచర్‌ను పరిచం చేయాలని చాలా కాలంగా యూజర్లు కోరుతున్నారని, ఈ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

చాలా సోషల్‌ మీడియా యాప్‌లలో స్టోరీస్‌ను పరిచయం చేసినందున టెలిగ్రామ్‌లో ఈ ఫీచర్‌ వద్దని ముందు అనుకున్నట్లు తెలిపారు. యూజర్లు ఎక్కువ మంది ఈ ఫీచర్‌ కావాలని కోరుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. జులై నుంచి టెలగ్రామ్‌లో స్టోరీస్‌ ఫీచర్‌ అందుబాటులో ఉంటుందని పావెల్‌ దురోవ్‌ తెలిపారు.

- Advertisement -

యూజర్లు టెలిగ్రామ్‌ యాప్‌లో స్టోరీస్‌ను పోస్ట్‌ చేసిన తరువాత వాటిని ఎవరెవరు చూడాలనేది నిర్ణయించుకోవచ్చు. ఇందుకోసం యూజర్లు స్టోరీస్‌ సెట్టింగ్స్‌లో ఎవ్రీవన్‌, ఓన్లీ యువర్‌ కాంట్రాక్ట్‌ ్స, వ్యూ సెలెక్ట్‌డ్‌ కాంటాక్ట్‌ ్స , లిస్ట్‌ ఆఫ్‌ క్లోజ్‌ ఫ్రెండ్స్‌ ఈ నాలుగు ఆప్షన్లలో తమను నచ్చిన దాన్ని ఎంపిక చేసుకోవచ్చు.

Advertisement

తాజా వార్తలు

Advertisement