Sunday, April 28, 2024

ట్విట్టర్‌లో ఎలాన్‌ పెట్టుబడులు, 9.2 శాతం వాటా కొనుగోలు..

టెస్లా అధిపతి ఎలాన్‌ మస్క్‌.. మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. సోషల్‌ మీడియా కంపెనీ టిట్టర్‌లో 9.2 శాతం వాటా కొనుగోలు చేశారు. అమెరికా స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు పంపిన నోటిఫికేషన్‌లో టిట్టర్‌ ఈ సమాచారాన్ని వెల్లడించింది. ఈ వార్తల నేపథ్యంలో.. ప్రీ మార్కెట్‌ ట్రేడ్‌లో టిట్టర్‌ షేర్లు 28 శాతం వరకు పెరిగాయి. ఎలాన్‌ మస్క్‌.. 2022, మార్చి 14 నాటికి టిట్టర్‌ ఇన్‌లో 9.2 శాతం నిష్క్రియాత్మక వాటాను కొనుగోలు చేయడానికి అంగీకరించారు. మస్క్‌.. 7,34,86,938 సాధారణ స్టాక్‌లను ఎలాన్‌ మస్క్‌ కలిగి ఉన్నాడని టిట్టర్‌ ఇన్‌ వెల్లడించింది.

ఈ మధ్య ఎలాన్‌ మస్క్‌ చేసిన ప్రకటన సంచలనంగా మారింది. తాను త్వరలో ఓ కొత్త సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ను పరిచయం చేస్తున్నట్టుగా ప్రకటించాడు. ప్రకటించిన వారంలోనే టిట్టర్‌లో వాటాలు కొనుగోలు చేయడం సంచలనంగా మారింది. అంతకుముందు కూడా టిట్టర్‌కు ఎంతో మద్దతుగా నిలిచాడు. టిట్టర్‌ వాక్‌ స్వేచ్ఛను అనుసరిస్తుందని తాను నమ్ముతున్నట్టు గతంలోనే ప్రకటించారు. టిట్టర్‌పై పోల్‌ కూడా నిర్వహించారు. ఇందులో 70 శాతం మంది ఎలాన్‌ వైపు నిలబడ్డారు. ఎలాన్‌ మస్క్‌ టిట్టర్‌ ఎప్పుడూ చాలా యాక్టివ్‌గా ఉంటాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement