Thursday, May 2, 2024

యాక్సిస్‌ సెక్యూరిటీస్‌, ఫిన్‌ప్లాన్‌ విడుదల.. ఫిన్‌ బింగో సహకారం

భారతదేశపు ప్రముఖ బ్రోకింగ్‌ సంస్థ యాక్సిస్‌ సెక్యూరిటీస్‌కు చెందిన ఆన్‌లైన్‌ బ్రాండ్‌ యాక్సిస్‌ డైరెక్ట్‌ ఇప్పుడు సమగ్రమైన ఆర్థిక ప్రణాళిక, సంపద నిర్మాణ వేదిక ఫిన్‌ప్లాన్‌ను విడుదల చేసింది. ఫిన్‌బింగో దీనికి అవసరమైన సహకారం అందిస్తుంది. సమాచారాన్ని శాస్త్రీయంగా విశ్లేషించడంతో పాటుగా మదుపరులు అన్ని రకాల ఆర్థిక ఇన్‌స్ట్రుమెంట్స్‌ను లోతుగా విశ్లేషించేందుకు సైతం తోడ్పడుతుంది. ఆర్థిక ప్రణాళికను ఫిన్‌ ప్లాన్‌ సరళీకరిస్తుంది. పూర్తి సమాచారంతో తమకు అత్యుత్తమంగా తోడ్పడే, స్వల్పకాలిక, దీర్ఘ కాలిక లక్ష్యాలను సాకారం చేసే ఉత్పత్తులను విడుదల చేస్తుంది. ఈ టూల్‌, మదుపరులకు అత్యంత శక్తివంతమైన మూడు ఆఫర్సింగ్‌ అయిన పోర్ట్‌ ఫోలియో డాక్టర్‌, వెల్త్‌ బిల్డర్‌, ట్యాక్స్‌ ప్లానర్‌ సేవలను అందిస్తుంది. ఈ ఆవిష్కరణ సందర్భంగా యాక్సిస్‌ సెక్యూరిటీస్‌ ప్రొడక్ట్‌ మార్కెటింగ్‌ హెడ్‌ వంశీ కృష్ణ మాట్లాడుతూ.. యాక్సిస్‌ సెక్యూరిటీస్‌ వద్ద తాము ఎప్పుడూ కూడా సాంకేతిక ఆధారితమే అయినప్పటికీ.. అతి సరళమైన పరిష్కారాలను అందించడం ద్వారా ఎలాంటి మార్కెట్‌ పరిస్థితుల్లో అయినా తమ మదుపరులకు సహాయపడాలని భావిస్తున్నామని తెలిపారు.

ఆర్థిక ప్రణాళికలకు మద్దతు..

ప్రతీ వినియోగదారునికి వినూత్న అవసరాలు ఉంటాయని, వారి సమగ్రమైన ఆర్థిక ప్రణాళికకు మద్దతు అందిస్తూ.. రూపొందించబడిన ఫిన్‌ప్లాన్‌, తమ వినియోగదారులకు అత్యుత్తమ విలువను జోడిస్తుందన్నారు. ఈ స్మార్ట్‌ టూల్‌ తమ వినియోగదారులకు అస్థిర పెట్టుబడి అవకాశాలు, దీర్ఘ కాలిక మార్కెట్‌ రిస్క్‌ల నుంచి దూరంగా ఉండేలా చేస్తుందని వివరించారు. ఈ ఫిన్‌ ప్లాన్‌ ఓ గొప్ప గేమ్‌ ఛేంజర్‌ అవుతుందని, తమ వినియోగదారుల అభివృద్ధి చెందుతున్న అవసరాలను తీర్చగల వ్యూహాత్మక ఆర్థిక విశ్లేషణను సైతం అందిస్తుందని విశ్వసిస్తున్నట్టు తెలిపారు. ఆదాయం, ఖర్చులు, పెట్టుబడులను క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తుందని, వెదర్‌ బిల్డర్‌ – సాంకేతిక ఆధారితమని తెలిపారు. అమెచ్యూర్‌ మదుపరులకు అత్యున్నత అనూకూలీకరణ ఉపకరణమన్నారు. ట్యాక్స్‌ ప్లానర్‌.. పన్నులను గరిష్టంగా ఆదా చేసుకునే రీతిలో రూపకల్పన చేయబడిందని వివరించారు. దీర్ఘ కాలిక లక్ష్యాలను మద్దతు అందించేందుకు ఆర్థిక నిర్ణయాలను తీసుకోవడంలో మదుపరులకు సహాయపడుతుందని అభిప్రాయపడ్డారు. వ్యక్తిగతీకరించిన, పరిశోధన ఆధారిత పెట్టుబడి ఆలోచనలు అని వివరించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement