Thursday, May 2, 2024

META లో ఏఐ ఫీచ‌ర్స్…

ఫేస్‌బుక్ మాతృ సంస్థ మెటా ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (AI) రేసులో అడుగుపెట్టింది. వాట్సప్‌, ఫేస్‌బుక్‌, మెసెంజర్‌, ఇన్‌స్టాగ్రామ్‌ వేదికలకు తన మెటా ఏఐని ఇంటిగ్రేట్‌ చేసింది. లాలామా 3 లార్జ్‌ లాంగ్వేజ్‌ మోడల్‌ ఆధారంగా పని చేస్తుంది. దీంతో చాట్‌జీపీటీ తరహాలో మెటా ఏఐ చాట్‌బాట్‌ ఏ ప్రశ్నకైనా చిటికెలో సమాధానం రాబట్టొచ్చు. అంతేకాదు వాట్సప్‌లో ఇకపై ఏఐ సాయంతో రియల్‌టైమ్‌ ఇమేజులను రూపొందించొచ్చని మెటా చెబుతోంది.

మరోవైపు తమ వేదికలపై అందిస్తున్న మెటా ఏఐని మరిన్ని దేశాలకు విస్తరిస్తున్నట్లు మెటా తెలిపింది. మన దేశంలోనూ కొందరు యూజర్లకు ఈ ఫీచర్‌ దర్శనమిస్తోంది. వాట్సప్‌ చాట్‌ మెనూలో వివిధ రంగులతో కూడిన వృత్తాకారంలో మెటా ఏఐ ఐకాన్‌ ఉంటుంది. దీనిపై క్లిక్‌ చేస్తే ‘ఆస్క్‌ మెటా ఏఐ ఎనీథింగ్‌’ అంటూ ఓ పాప్‌అప్‌ ఓపెన్‌ అవుతుంది. కంటిన్యూపై క్లిక్‌ చేస్తే మెటా ఏఐతో చాట్‌ మెనూ ఓపెన్‌ అవుతుంది. ఈ చాట్‌ మెనూలో వివిధ అంశాలకు సంబంధించిన చాట్‌జీపీటీ తరహాలో ప్రశ్నలకు సమాధానాలు ఇస్తుంది. రానున్న రోజుల్లో ఈ ఫీచర్‌ అందరికీ అందుబాటులోకి రానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement