Thursday, May 2, 2024

LSG vs CSK | విజృంభించిన ఓపెనర్లు.. చెన్నైపై లక్నో ఘన విజయం

ఐపీఎల్ 2024లో భాగంగా నేడు హోం గ్రౌండ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్ విజయం సాధించింది. చెన్నై నిర్దేశించిన 177 పరుగుల ఛేదనలో లక్నో ఓపెనర్లు చెలరేగిపోయారు. దీంతో సీఎస్‌కేపై జట్టు 8 వికెట్ల తేడాతో గెలుపొందింది.

సొంగ‌డ్డ‌పై సీఎస్కేను త‌క్కువ‌కే క‌ట్ట‌డి చేసిన ల‌క్నోకు ఓపెన‌ర్లు శుభారంభ‌మిచ్చారు. క్వింట‌న్ డికాక్‌(54), కెప్టెన్ కేఎల్ రాహుల్(82) చ‌రో హాఫ్ సెంచ‌రీతో చెన్నై బౌల‌ర్ల‌పై విరుచుకుప‌డుతున్నారు. ఇక ఆ త‌రువాత వ‌చ్చిన నికోలస్ పూరన్ 23 (నాటౌట్) మెప్పించాడు. దాంతో 19 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసిన లక్నో… 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇక చెన్నై బౌలర్లలో ముస్తాఫిజుర్ రెహమాన్, మతీషా పతిరనా చెరో వికెట్ దక్కించుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement