Sunday, May 19, 2024

2025కల్లా 50శాతం ఈవీ.. ఈకాం ఎక్స్‌ప్రెస్‌ లక్ష్యం..

హైదరాబాద్‌ : ఈ-కామర్స్‌ రంగానికి ఆద్యంతం లాజిస్టిక్‌ పరిష్కారాలను అందించిన భారతదేశంలో అగ్రగామి సాంకేతిక సంస్థ ఈకాం ఎక్స్‌ప్రెస్‌ లిమిటెడ్‌, 2025 నాటికి తమ 50 శాతం తుది మైల్‌ ఫ్లీట్‌ను విద్యుత్‌ వాహనాలకు సంక్రమింపజేసేలా ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈకాం ఎక్స్‌ప్రెస్‌ లిమిటెడ్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ టీఏ కృష్ణన్‌ మాట్లాడుతూ.. గ్రీన్‌ లాజిస్టిక్‌ దిశగా ముందుకు వెళ్తున్నట్టు తెలిపారు. భద్రతాయుతమైన పర్యావరణానికి తమ నిబద్ధతను ఇది ఉదహరిస్తుందని నమ్ముతున్నట్టు వివరించారు. లాజిస్టిక్స్‌, రవాణా రంగాన్ని పూర్తిగా మార్చేందుకు మెరుగైన వ్యూహాలతో ముందుకు వెళ్తున్నట్టు తెలిపారు. ఈకాం ఎక్స్‌ప్రెస్‌ వద్ద.. నిర్వహణీయ డెలివరీలను చేసేందుకు అతిగొప్ప అవెన్యూలను రూపొందించేందుకు తాము ప్రయత్నిస్తున్నామన్నారు.

ఎలక్ట్రిక్‌ బైక్‌ల వినియోగం అనేది తమ తుది మైల్‌ డెలివరీని గ్రీనర్‌గా మార్చేందుకు తమ ప్రయత్నాలను ముందడుగుగా వివరించారు. చార్జింగ్‌ ఫెసిలిటీతో పాటు ఈవీ రోల్‌ ఔట్‌కు సపోర్టు చేసేందుకు కావాల్సిన మౌలిక సదుపాయాలను సరైన క్రమంలో ఉంచేందుకు ఈకాం ఎక్స్‌ప్రెస్‌ పని చేస్తోందన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement