Friday, May 17, 2024

రెనో 10 సిరీస్‌లో ఒకేసారి 3 ఫోన్లు.. కొత్త ఫోన్ల‌ను లాంచ్‌చేయ‌నున్న ఒప్పో

చైనాకు చెందిన మొబైల్‌ తయారీ సంస్థ ఒప్పో భారత మార్కెట్లోకి కొత్త ఫోన్లు లాంచ్‌ చేసింది. రెనో 10 సిరీస్‌లో మూడు ఫోన్లు తీసుకొచ్చింది. ఒప్పో రెనో 10 5జీ, ఒప్పో రెనో 10 ప్రో 5జీ, ఒప్పో రెనో 10 ప్రో ప్లస్‌ 5జీ పేరిట వీటిని విడుదల చేసింది. వీటితో పాటు ఒప్పో ఎంకో ఎయిర్‌ 3 ప్రో పేరిట కొత్తగా వైర్‌లెస్‌ ఇయర్‌ బడ్స్‌ను కూడా లాంచ్‌ చేసింది. ఒప్పో రెనో 10 ప్రో ప్లస్‌ 5జీ ఫోన్‌ ధరను రూ.54,999గా కంపెనీ నిర్ణయించింది.

- Advertisement -

ఇది 12జీబీ-256 జీబీ వేరియంట్‌లో వస్తోంది. రెనో 10 ప్రో 5జీ 12జీబీ-256 జీబీ వేరియంట్‌ ధరను రూ.39,999గా పేర్కొంది. గ్లాసీ పర్పుల్‌, సిల్వర్‌ గ్రే రంగుల్లో ఈ ఫోన్లు లభిస్తాయి. ప్రో, ప్రో ప్లస్‌ మోడళ్లు జులై 13 నుంచి అమ్మకానికి రానున్నాయి. ప్లిnప్‌కార్ట్‌, ఒప్పో ఇండియా ఆన్‌లైన్‌ స్టోర్లతో పాటు ప్రధాన రిటైల్‌ స్టోర్లలో ఈ ఫోన్లు లభించనున్నాయి. ఒప్పో రెనో 10 5జీ ధరను జులై 20న వెల్లడించనున్నారు. ఇది ఐస్‌ బ్లూ, సిల్వర్‌ గ్రే రంగుల్లో లభించనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement