Thursday, May 9, 2024

ప్రభుత్వ బ్యాంక్‌ల లాభం 25,685 కోట్లు

దేశంలో12 ప్రభుత్వ రంగ బ్యాంక్‌ల ఉమ్మడి నికర లాభం రెండో త్రైమాసికంలో 25,685 కోట్లుగా ఉందని కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలాసీతారామన్‌ తెలిపారు. 2022-23 ఆర్ధిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో నెలల్లో ప్రభుత్వ రంగ బ్యాంక్‌ నికర లాభం 31.6 శాతం పెరిగి 40,991 కోట్లుగా ఉన్నాయి. ప్రభుత్వం చేసిన కృషి వల్ల ప్రభుత్వ బ్యాక్‌ల మొండి బకాయిలు తగ్గాయని సోమవారం నాడు ఆర్ధిక మంత్రి నిర్మలాసీతారామన్‌ చెప్పారు.

రెండో త్రైమాసికంలో ఎస్‌బీఐ నికర లాభం 13,265 కోట్లు వచ్చింది. వార్షిక ప్రాతిపదికన ఇది గత సంవత్సరంలో ఇదే త్రైమాసికం కంటే 74 శాతం ఎక్కువ. ప్రభుత్వ రంగ బ్యాంక్‌ల్లో ఎన్‌పీఏలను తగ్గించేందుకు ప్రభుత్వం చేసిన కృషి ఫలించడంతో దాని ఫలితంగానే నిరక లాభాలు పెరిగాయని ఆమె చెప్పారు. రెండో త్రైమాసికంలో బ్యంక్‌ల నికర లాభం 50 శాతం పెరిగిందని, ఆరు నెలల ఫలితాల్లో 31.6 శాతం పెరుగుదల నమోదు చేసినట్లు ఆర్ధిక మంత్రి వివరించారు.

గత సంవత్సరం రెండో త్రైమాసికంలో పోల్చితే కెనరా బ్యాంక్‌ నికర లాభం 89 శాతం పెరిగి 2,525 కోట్లుగా ఉందని చెప్పారు. కోల్‌కతా కేంద్రంగా పని చేస్తున్న యూకో బ్యాంక్‌ నికర లాభంలో 145 శాతం పెరుగుదలతో 504 కోట్లు వచ్చాయన్నారుఉ. బ్యాంక్‌ బరోడా నికర లాభం 58.70 శాతం పెరిగి 3,312.42 కోట్లుగా నమోదైయ్యాయి.

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ 9 శాతం, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 63 శాతం నికర లాభాల్లో తగ్గుదల నమోదు చేశాయి. మొండిబకాయిల మూలంగానే నికర లాభంలో తగ్గుదల నమోదైనట్లు పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్ పేర్కొంది. బ్యాంక్‌కు రావాల్సిన బాకీలు ఈ త్రైమాసికంలో 894 కోట్ల నుంచి 1912 కోట్లకు పెరిగాయని బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా పేర్కొంది. వీటిలో ఎక్కవ శాతం రాష్ట్ర ప్రభుత్వాల ఉంచి రావాల్సినవే ఉన్నాయని తెలిపింది. రిజర్వ్‌ బ్యాంక్‌ తనిఖీలకు ముందే ఇవి రావాల్సి ఉన్నప్పటికీ, జాప్యం జరిగిందని అందువల్లే అవి నమోదు కాలేదని పేర్కొంది. యూకోబ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర అత్యధిక శాతం లాభాలను నమోదు చేశాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement