Wednesday, May 1, 2024

ద్రవ్యోల్బణంపై పోరాటానికి 2లక్షల కోట్లు కావాలే.. ప్రపంచ వ్యాప్తంగా ఇదే పరిస్థితి

న్యూఢిల్లి : అంతర్జాతీయంగా నెలకొన్న ప్రతికూల పరిస్థితుల కారణంగా ప్రపంచ దేశాలన్నీ ఆర్థిక, ఆహార, ఇంధన, ఆయిల్‌ సంక్షోభాల్లో కొట్టుమిట్టాడుతున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా, యూకే, రష్యా, చైనా వంటి దేశాల ద్రవ్యోల్బణాలు రికార్డు స్థాయికి చేరుకుంటున్నాయి. యూకేలో 40 ఏళ్ల గరిష్టానికి ద్రవ్యోల్బణం ఎగబాకింది. అదేవిధంగా భారత్‌లోనూ టోకు, రిటైల్‌ ద్రవ్యోల్బణాలు భారీగా పెరిగాయి. ఆహారం, ఇంధనం, కూరగాయల వంటి నిత్యావసర సరుకుల ధరలు భారీగా పెరగడంతో.. ద్రవ్యోల్బణం పెరుగుతున్నది. ఈ నేపథ్యంలో.. కేంద్ర ప్రభుతం దిద్దుబాటు చర్యలు తీసుకుంటున్నది. ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయాలంటే.. పెరుగుతున్న నిత్యావసర ధరలకు కళ్లెం వేయాల్సి అవసరం ఉంది. ఇందుకు గాను.. కేంద్ర ప్రభుత్వం రాయితీలతో పాటు ఆర్థిక ఉపశమన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం అదుపు చేయాలంటే.. భారత్‌ ప్రభుతానికి కనీసం రూ.2లక్షల కోట్ల (26 బిలియన్‌ డాలర్లు) అవసరం ఉంది. ఇద్దరు ప్రభుత్వ అధికారులు రైటర్స్‌కు తెలిపిన వివరాల ప్రకారం..

17 ఏళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం..

అంతర్జాతీయంగా క్రూడాయిల్‌ ధరలు పెరుగుతుండటంతో.. దేశీయంగా పెట్రోల్‌, డీజెల్‌ ధరలు కూడా పెరుగుతున్నాయి. దీన్ని అదుపులోకి తీసుకొచ్చేందుకు శనివారమే.. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ కీలక ప్రకటన చేశారు. పెట్రోల్‌, డీజెల్‌ ధరలపై కేంద్ర ప్రభుతం ఎక్సైజ్‌ సుంకం తగ్గించడంతో.. రూ.లక్ష కోట్ల గండిపడింది. దీన్ని మళ్లిd రాబట్టుకునేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై కేంద్రం తీవ్రంగా ఆలోచిస్తున్నది. భారత్‌లో ఏప్రిల్‌లో నమోదైన రిటైల్‌ ద్రవ్యోల్బణం 8 ఏళ్ల గరిష్టానికి చేరుకోగా.. టోకు ద్రవ్యోల్బణం 17 ఏళ్ల గరిష్టానికి ఎగబాకింది. ఇది ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుతానికి తలనొప్పిగా మారింది. ఈ ఏడాదిలో పలు రాష్ట్రాల్లో అసెంబ్లి ఎన్నికలు ఉన్నాయి. పెరుగుతున్న నిత్యావసర ధరలు.. బీజేపీ ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముందే మేల్కొన్న మోడీ సర్కార్‌.. రాయితీలతో ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది.

మరింత సుంకం తగ్గించే అవకాశం!

ద్రవ్యోల్బణాన్ని కిందికి తీసుకొచ్చేందుకు చాలా ప్రయత్నాలు చేస్తున్నామని, ఉక్రెయిన్‌-రష్యా మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు.. ద్రవ్యోల్బణం భారీగా పెరిగేందుకు కారణం అవుతుందని ఓ కేంద్ర ప్రభుత్వ అధికారి చెప్పుకొచ్చారు. ఎరువులపై రాయితీలు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వానికి రూ.50,000 కోట్లు అదనంగా అవసరం అవుతాయని వివరించారు. ప్రస్తుత లెక్క ప్రకారం.. రూ.2.15 లక్షల కోట్లు అంచనా వేశారు. ముడి చమురు ధరలు పెరుగుతూనే ఉన్నాయని, ఇదే జరిగితే మళ్లిd పెట్రోల్‌, డీజెల్‌పై కేంద్ర విధించే ఎక్సైజ్‌ సుంకం మరింత తగ్గించాల్సి వస్తుందని అభిప్రాయపడ్డారు. ఇదే జరిగితే.. ఏప్రిల్‌ 1 నుంచి 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను.. రూ.1 లక్ష కోట్ల నుంచి రూ.1.50 లక్షల కోట్ల వరకు భారం పెరిగినా ఆశ్చర్యపోనవసరం లేదన్నారు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను లక్ష్యంగా పెట్టుకున్న జీడీపీ వృద్ధి రేటు 6.4 శాతం నుంచి దిగజారే అవకాశాలు ఉన్నాయని పేర్లు చెప్పేందుకు ఇష్టపడి ఆ ఇద్దరు అధికారులు వివరించారు.

- Advertisement -

నిధుల సమీకరణపై దృష్టి

ఈ చర్యలన్నింటినీ ఎదుర్కొని.. జీడీపీ వృద్ధి రేటు లక్ష్యానికి చేరుకునేందుకు, ద్రవ్యోల్బణం అదుపులోకి తీసుకొచ్చేందుకు మార్కెట్‌ నుంచి మరింత నిధుల సమీకరణ చేయాల్సి ఉంటుందని ఇద్దరు ప్రభుత్వ అధికారులు అభిప్రాయపడ్డారు. ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌లోని కేటాయింపులను దృష్టిలో పెట్టుకుని.. 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను.. రూ.14.31 లక్షల కోట్లను అప్పుగా తీసుకొచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్టు సమాచారం. అదనపు రుణాలు ప్రణాళికబద్ధమైన ఏప్రిల్‌-సెప్టెంబర్‌లో రూ.8.45 లక్షల కోట్ల రుణం ప్రభావం చూపదని, జనవరి-మార్చి 2023లో చేపట్టొచ్చని వివరించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement