Friday, April 19, 2024

కేంద్రంపై భారం నిజమే : మాజీ ఆర్థికమంత్రి చిదంబరం..

పెట్రోల్‌, డీజెల్‌పై ఎక్సయిజ్‌ సుంకాన్ని తగ్గించడంవల్ల భారం అంతా కేంద్రప్రభుతంపైనే పడుతుందనని, అది నిజ‌మేనని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పి.చిదంబరం అంగీకరించారు. కేంద్రం పరిధిలోకి వచ్చే అడిషనల్‌ ఎక్సయిజ్‌ డ్యూటీనుంచి ధరల కోతవల్ల ఈ ప్రభావం కేంద్రంపైనే ఉంటుందని, అయితే కేంద్ర ఆర్థికమంత్రి ఎక్సయిజ్‌ డ్యూటీ తగ్గించడం అన్న పదాన్ని వాడటం వల్ల రాష్ట్ర ప్రభుతాల వాటాలోంచి కోతపడిందని భావించామని చెప్పుకొచ్చారు. పెట్రోల్‌, డీజెల్‌పై రాష్ట్ర ప్రభుత్వాలు వాల్యూయాడెడ్‌ ట్యాక్స్‌ వేస్తాయని, దానిని తగ్గించడంవల్ల రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయం తగ్గిపోతుందని, ఈ విషయంలో అవి ఏమీ చేయగలిగే పరిస్థితి లేదన్నారు. సుంకాల్లోంచి రాష్ట్ర ప్రభుత్వాలకు వచ్చే వాటా చాలా తక్కువని, అందువల్ల రాష్ట్ర ప్రభుత్వాలకు గ్రాంట్లు, ప్రత్యేక నిధులు విడుదల చేయడం ద్వారా వాటిని బలోపేతం చేస్తే మంచిదని హితవు పలికారు

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement