Saturday, May 4, 2024

ఇప్పటికే రూ.150 దాటిన కిలో వంట నూనె

వంట నూనెల ధరలు సామాన్యులకు సెగలు పుట్టిస్తున్నాయి. ప్రస్తుతం వంట నూనెల ధరలు 30 శాతం నుంచి 60 శాతం పెరగడంతో ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. ఏడాది కిందట రూ.100 పలికిన కిలో వంట నూనె ప్రస్తుతం రూ.150 పలుకుతోంది. రానున్న రోజుల్లో రూ.200 వరకు ధర పలకొచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా వంట నూనెల సరఫరా తగ్గడంతో నూనెలకు డిమాండ్‌ అనూహ్యంగా పెరిగింది. దీంతో వంట నూనెల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. చైనాలో సోయాబీన్‌కు డిమాండ్‌ పెరిగింది. మరోవైపు బ్రెజిల్‌, అర్జెంటీనాల్లో ప్రతికూల వాతావరణంతో నూనెల ఉత్పత్తి దెబ్బతింది. మరోవైపు దేశీ మార్కెట్‌లోనూ వినియోగం పెరగడంతో పాటు పండగ సీజన్‌లో వంటనూనెలకు డిమాండ్‌ ఎగబాకే క్రమంలో రాబోయే రోజుల్లో నూనెల ధరలు మరింత పెరుగుతాయనే వార్తలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. ఇప్పటికే పెట్రోల్ ధరలు సామాన్యులను ఉక్కిరి బిక్కిరి చేస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement