Friday, May 17, 2024

TTD Board: శ్రీవారి భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం

తిరుమల తిరుపతి దేవాస్థానం(టీటీడీ) పాలకమండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. గతేడాది మాదిరిగానే వైకుంఠ ఏకాదశి సందర్భంగా 10 రోజులు పాటు భక్తులకు వైకుంఠ ద్వారా దర్శనం కల్పిస్తామని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి వెల్లడించారు. కొత్త ఏడాదిలో శ్రీవారి దర్శన టికెట్లు పెంచడంతోపాటు ఆర్జిత సేవలకు భక్తులను అనుమతించాలని నిర్ణయం తీసుకున్నామని వివరించారు. సంక్రాంతి తర్వాత దర్శన టికెట్లు పెంచుతామన్నారు. చిన్నపిల్లల ఆసుపత్రి నిర్మాణం కోసం విరాళాలు అందించిన భక్తులుకు ఉదయాస్తమాన సేవకు అనుమతించేలా అవకాశం కల్పిస్తామన్నారు.

పద్మావతి పిల్లల ఆస్పత్రి నిర్మించటంతోపాటు అన్నమయ్య మార్గంలో రోడ్డు, నడక దారి నిర్మించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. అన్నమయ్య ప్రాజెక్టు వల్ల దెబ్బతిన్న ఆలయాలు పునరుద్ధరణ, శ్రీశైలంలో ఆలయ గోపురానికి బంగారు తాపడం చేయిస్తామని చెప్పారు. భక్తులుకు శ్రీవేంకటేశ్వర నామ కోటి పుస్తకాలను అందిస్తామన్న చైర్మన్ సుబ్బారెడ్డి.. 3 కోట్ల రూపాయల వ్యయంతో వసతి గదుల్లో గీజర్లు ఏర్పాటు చేస్తామన్నారు. రూ. 10 కోట్లతో స్విమ్స్ లో భవనాలు నిర్మాణం జరుగుతుందన్నారు. రూ.12 కోట్ల వ్యయంతో మహిళా యూనివర్సిటీలో హస్టల్ భవనాలు నిర్మిస్తామని వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement