Friday, April 26, 2024

AP Legislative Council: శాసన మండలిలో 32కు చేరిన వైసీపీ బలం

ఏపీ శాసన మండలిలో అధికార వైఎస్ఆర్సీపీ బలం పెరిగింది. ప్రస్తుతం ఆ పార్టీ బలం 32కు చేరింది. అనంతపురం జిల్లాకు సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికల్లో టి. వెంకట శివనాయుడు తన నామినేషన్ ను ఈరోజు ఉపసంహరించుకోవడంతో మొత్తం 11 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలను వైయస్ఆర్సీపీ కైవసం చేసుకుంది. దీంతో మండలిలో వైసీపీ బలం పెరిగింది.

ఏపీ అసెంబ్లీలో అధికార వైసీపీ తిరుగులేని శక్తిగా ఉంది. సభలో ఆపార్టీకి 151 మంది సభ్యులు ఉన్నారు. అయితే, గతంలో మండలిలో మాత్రం ఆపార్టీకి సభ్యుల సంఖ్య చాలా తక్కువగా ఉండేది. గతంలో మండలిలో మాత్రం టీడీపీది పైచేయిగా ఉంది. దీంతో పలు బిల్లులు అసెంబ్లీని దాటుకుని వెళ్లినా మండలిలో మాత్రం అడ్డుకట్ట పడుతూ వచ్చింది. రాజధాని వికేంద్రీకరణ బిల్లు, స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం బిల్లులు అసెంబ్లీలో గట్టెక్కినా… గతంలో శాసన మండలిలో మాత్రం బిల్లు పాస్ కాలేదు. ఆ సమయంలో టీడీపీకి మండలిలో బలం ఎక్కువగా ఉండేది. ఈ కారణంతో మండలితో అవసరం లేదని వైసీపీ సర్కార్ నిర్ణయించింది.

2020 జనవరిలో శాసన మండలి రద్దు తీర్మానాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఆమోదం తర్వాత కేంద్రానికి పంపించారు. ఇపుడు శాసన మండలిలో వైసీపీకి ఆధిక్యం పెరిగింది. దీంతో శాసన మండలిని పునరుద్ధరించాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవల కేంద్రానికి పంపిన తీర్మానాన్ని వెనక్కి తీసుకోవాలని అసెంబ్లీలో తీర్మానం చేసింది. ప్రస్తుతం మండలిలో చైర్మన్ స్థానాని కూడా వైసీపీ హస్తం గతం చేసుకుంది. ఇప్పుడు మండలి ఎన్నికల్లో ఆ పార్టీకి ఎదురులేకుండా పోయింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌ట్విట్టర్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement