Monday, April 29, 2024

Flash: ఇదేమి సంస్కృతి?.. ఉద్యోగిపై మరో వైసీపీ నేత బూతు పురాణం

నిన్నగాక మొన్న అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గంలోని ముదిగుబ్బ వైసీపీ నేత.. ఉద్యోగులను ఇష్టానుసారం తిట్టారు. ఉద్యోగులపై ఉచిత అనుచితంగా ప్రవర్తించిన అతనిపై ఎమ్మెల్యే చర్యలు తీసుకున్నట్టు ప్రకటించారు. తాజాగా మరో ఉద్యోగిపై.. రాప్తాడు నియోజకవర్గంలోని ఒక మండల కన్వీనర్.. చేసిన వ్యాఖ్యలు ఉద్యోగ వర్గాలను కలవరపెడుతున్నాయి. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.

ఆడియో..:

వివరాల్లోకి వెళితే.. రాప్తాడు నియోజకవర్గంలోనూ సేమ్ సీన్ రిపీట్ – జియాలజిస్ట్ ను రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి అనుచరుడు అమర్నాథ్ రెడ్డి అసభ్య పదజాలంతో దూషించాడు. కనగానపల్లి వైసీపీ మండల కన్వీనర్‍గా ఉన్న అమర్నాథ్ రెడ్డి.. తనకు చెప్పకుండా మండలంలోకి అడుగుపెడతావా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. నువ్వు మగాడివైతే నా మండలంలోకి అడుగుపెట్టు నీ సంగతి చూస్తా అంటూ జియాలజిస్ట్ కు బెదిరించాడు. రోజుకో వ్యవహారం వెలుగులోకి వస్తున్నప్పటికీ పోలీస్, ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడంపై ఉద్యోగులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement