Monday, April 29, 2024

దిశ యాప్: మహిళలను కాపాడే అస్త్రం

ఆపదలో ఉన్న మహిళలు, యువతులను కాపాడే అస్త్రం ‘దిశ యాప్’ అని సీఎం వైఎస్ జగన్ అన్నారు. దిశ యాప్‌కు మహిళా పోలీసులు, వాలంటీర్లే అంబాసిడర్లు తెలిపారు. మంగళవారం దిశ మొబైల్‌ యాప్‌ అవగాహన సదస్సులో భాగంగా విజయవాడలోని గొల్లపూడిలో నిర్వహించిన దిశ యాప్ అవగాహన సదస్సులో పాల్గొన్నారు. మహిళా భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన దిశ మొబైల్‌ యాప్‌ను విద్యార్థినులు, యువతులు, మహిళలకు వివరించారు.

ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ ప్రతి ఇంటికీ వెళ్లి ‘దిశ యాప్’పై అవగాహన కల్పించాలన్నారు. మహిళలందరితోనూ యాప్ ను డౌన్ లోడ్ చేయించాలని వారికి సూచించారు. ప్రకాశం బ్యారేజీ ఘటన కలచి వేసిందని, యువతులు, మహిళల భద్రతకోసమే ఈ దిశ యాప్ ను రూపొందించామని ఆయన చెప్పారు. స్మార్ట్ ఫోన్ ఉండే ప్రతి మహిళా ఈయాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఇప్పటికే 17 లక్షల మందికిపైగా ఈ యాప్ ను డౌన్ లోడ్ చేసుకున్నారని, యాప్ కు నాలుగు అవార్డులు కూడా వచ్చాయని ఆయన వివరించారు. పోలీసులు మంచి చేసే ఆప్తులన్నారు. మహిళల భద్రత, రక్షణపై వెనకడుగు వేయబోమని ఆయన చెప్పారు. ఇప్పటికే రాష్ట్రంలో 18 దిశ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేశామని తెలిపారు. దిశ చట్టాన్నీ తెచ్చామని, త్వరలోనే ప్రత్యేక కోర్టులనూ ఏర్పాటు చేస్తామని సీఎం జగన్ చెప్పారు.

ఇదీ చదవండి: ఏపీలో మహిళలకు రక్షణ కరువు.. ష‌ర్మిల‌, సునీత‌ల‌కే భ‌ద్ర‌త‌లేదు!

Advertisement

తాజా వార్తలు

Advertisement