Friday, May 7, 2021

జగన్ ను కలిసిన తిరుపతి ఎంపీ

తిరుపతి పార్లమెంట్‌ ఉప ఎన్నికలో ఘన విజయం సాధించిన డాక్టర్‌ ఎం. గురుమూర్తిని, పార్టీ నేతలను సీఎం వైఎస్ జగన్ అభినందించారు. సోమవారం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను తిరుపతి ఎంపిగా ఎన్నికైన గురుమూర్తి  మర్యాదపూర్వకంగా కలిశారు. గెలుపు ధ్రువీకరణ పత్రాన్ని ముఖ్యమంత్రికి చూపించారు. గురుమూర్తితోపాటు చిత్తూరు జిల్లా నేతలు, డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ప్రభుత్వ విప్‌ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు భూమన కరుణాకర్‌రెడ్డి, కిలివేటి సంజీవయ్య తదితరులు సీఎంను కలిసిన వారిలో ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Prabha News