Friday, May 17, 2024

వైసీపీ ఎమ్మెల్యేకు తృటిలో త‌ప్పిన ప్ర‌మాదం

నెల్లూరు జిల్లా కోవూరు వైసీపీ ఎమ్మెల్యే ప్ర‌స‌న్న‌కుమార్ రెడ్డికి తృటిలో ప్రమాదం తప్పింది. ఇనమడుగు క్రాస్ రోడ్డు స‌మీపంలో ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న‌ కారును లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఎమ్మెల్యే కారు వెనుక భాగం పూర్తిగా ధ్వంసమైంది. కారులో ఉన్న ఎమ్మెల్యే, విజయాడెయిరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి క్షేమంగా బయటపడ్డారు. దేవుడి ద‌యవ‌ల్ల ప్రాణాలతో బయట పడ్డామని ఎమ్మెల్యే ప్ర‌స‌న్న‌కుమార్ రెడ్డి చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement