Thursday, May 2, 2024

AP | ఆరు నెలల్లో వైసీపీ అడ్రస్ గల్లంతు.. లోకేశ్ పాద‌యాత్ర‌లో టీడీపీ నేత‌లు

ఎన్టీఆర్ ప్రభ న్యూస్ బ్యూరో: మరో ఆరు నెలల్లో వైసిపి అడ్రస్ గల్లంత కావడం ఖాయమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న, పోలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. విజ‌య‌వాడ నగరంలో జరుగుతున్న లోకేష్ పాదయాత్ర విధి కేంద్రం వద్ద వారు విలేకరులతో మాట్లాడారు. మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు మాట్లాడుతూ సైకో జగన్ కి, సజ్జల రామకృష్ణా రెడ్డికి మతిభ్రమించి మాట్లాడుతున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు. వెల్లంపల్లి, మల్లాది విష్ణు, అవినాష్ లను పిలిపించి సజ్జల స్క్రిప్టు చదివించారన్నరి.వెల్లంపల్లి శీను చిలక పలుకులు పలుకుతున్నాడన్నారు.

వెల్లంపల్లి శీను సమర్థుడైతే మంత్రి పదవి ఎందుకు పోతుంది? చెప్పాలన్నారు గుళ్లో లింగాలను మింగిన వ్యక్తి వెల్లంపల్లి శీను. దేవుడి సొమ్ము తిన్నందుకే మంత్రి పదవి పోయిందన్నారు. టీడీపీ నాయకులు వెల్లంపల్లి శీను బెండు తీస్తారన్నారు. 9 నెలల్లో మీ భవితవ్యం తేలనుందన్నారు. వెల్లంపల్లి శీను ఈసారి గెలవలేడనే విషయం అతనితోపాటు అందరికి కూడా తెలుసన్నారు. వెల్లంపల్లి కొట్టేసిన కోట్లు జగన్ కక్కిస్తాడనే భయంతోనే వెల్లంపల్లి కారు కూతలు కూస్తున్నాడన్నారు.అవినాష్ కు గుడివాడ ఎమ్మెల్యే టికెట్ ఇస్తే గెలవలేకపోయారన్నారు.. దేవినేని నెహ్రూ చనిపోతే చంద్రబాబు దేవినేని నెహ్రూ ఇంటికి వచ్చి పరామర్శించడం జరిగిందను గుర్తు చేశారు.

లక్షమంది టీడీపీ కార్యకర్తలు, ప్రజలతో లోకేష్ పాదయాత్రకు అపూర్వ స్పందన లభించిందన్నారు. వైసీపీ ఆరు నెలల్లో దుకాణం కట్టేయనుందన్నారు. నాలుగున్నరేళ్లలో విజయవాడకు వైసీపీ నాయకులు ఏం చేశారో చెప్పాలన్నారు. విజయవాడ హాస్పిటల్ బిల్డింగులు, అండర్ డ్రైనేజ్ కాలువలు నిర్మించింది, కొండ మీద పట్టాలు ఇచ్చింది, విజయవాడలో ఫ్లై ఓవర్ లు నిర్మించింది టీడీపీనే అని గుర్తు చేశారు. లోకేష్ పాదయాత్రలో ఇంతవరకు ట్రైల్ మాత్రమే చూస్తూ వస్తున్నారన్నారు. గన్నవరంలో జరిగే అసలైన సినిమాకి లక్షలాది మంది తరలి రాబోతున్నారన్నారు. వైసీపీ నాయకులు ఎన్ని కుయుక్తులు పన్నినా వృధాయే అన్నారు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమ మాట్లాడుతూ లోకేష్ కాలి గోటికి కూడా వెల్లంపల్లి శీను తూగలేడన్నరు. వెల్లంపల్లి శీను, మల్లాది విష్ణు, అవినాష్ లు వారి తాహతేంటో ముందు తెలుసుకొని మాట్లాడాలన్నారు. లోకేష్ పాదయాత్ర 190 వ రోజు బ్రహ్మాండంగా జరుగుతోందన్నారు. 206 కిలో మీటర్లు దిగ్విజయంగా పాదయాత్ర నిర్వహించడం చూసి తాడేపల్లి ప్యాలెస్ లో ఉన్న జగన్ కు వణుకు పుట్టిందన్నారు.

- Advertisement -

యువగళం పాదయాత్రకు భంగం కలిగించాలని ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. లోకేష్ పాదయాత్ర విజయవాడలో జరగనీయం, అడుగు పెట్టనీయం అన్న వారికి లాగులు తడిచాయన్నారు. విజయవాడ నడిబొడ్డు నుంచి చెబుతున్నాను.. టచ్ చేసి చూడండి తెలుస్తుంది. ఏం చేసియున్నా టీడీపీ సత్తా ఏంటో చూపేవాళ్లం అని హెచ్చరించారు. వైసీపీ నాయకులకు ఫ్రష్టేషన్ తప్ప ఏమీ మిగలదన్నారు. కానరాని చోట్లకి వెళ్లిపోతారన్నారు. వైసీపీకి అడ్రస్ ఉండదన్నారు.. వైసీపీ గల్లంతు కానుందన్నారు.

టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న మాట్లాడుతూ.. వెల్లంపల్లి శ్రీనుకు ఆర్యవైశ్యుల గురించి మాట్లాడే అర్హత ఏ కోశాన లేదన్నారు. ఇప్పటికి అనేక పార్టీలు మారిన వ్యక్తి వెల్లంపల్లి శ్రీను, శ్రీను నీతులు మట్లాడితే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుందన్నారు. వైసీపీ గేట్లు ఎత్తితే అందరూ వైసీపీ పార్టీలో చేరుతారని వెల్లంపల్లి మాట్లాడారన్నారు. అందరూ నీలా కాదన్నారు. ఆర్యవైశ్యుల్ని టీడీపీ ఎప్పుడూ గౌరవించి వారికి సముచిత న్యాయం చేస్తోందన్నారు. టీజీ వెంకటేష్ అనే ఆర్యవైశ్యునికి రాజ్యసభ సీటు ఇచ్చిన పార్టీ టీడీపీ. కులాన్ని అడ్డం పెట్టుకొని లోకేష్ బాబుపై అవాకులు, చవాకులు పేలిస్తే చూస్తూ ఊరుకునేది లేదన్నారు.

సజ్జల రామకృష్ణా రెడ్డి, వెల్లంపల్లి శీను ఇద్దరు కలిసి 20 కోట్లు దోచుకున్నారన్నారు. వన్ టౌన్ లో వెల్లంపల్లి శీను ఈ సారి ఎన్నికల్లో ఓడిపోవడం ఖాయం అన్నారు. టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగుల్ మీరా మాట్లాడుతూ లోకేష్ పాదయాత్రకు వస్తున్న జన ప్రభంజనాన్ని చూసి ఓర్వలేక వెల్లంపల్లి శీను ఏదేదో మాట్లాడుతున్నాడు. వెల్లంపల్లి కారు డిక్కీలో ఎప్పుడూ నాలుగు జెండాలుంటాయి. ఎప్పుడు ఏ పార్టీ జెండా అవసరమైతే ఆ జెండా వాడుతాడు. టీడీపీ గురించి మాట్లాడే వయసు, అనుభం వవెల్లంపల్లి శీనుకు లేదు.

లోకేష్ పాదయాత్రకు ప్రకాశం బ్యారేజి నుంచి చివరి వరకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అపూర్వ స్వాగతం లభించింది. లోకేష్ పాదయాత్ర ప్రారంభించినప్పటి నుంచి వైసీపీ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి. వెల్లంపల్లి శీను ఇంటికి వెళ్లడం ఖాయం. వందమంది జగన్ లు వచ్చినా చంద్రబాబు ముఖ్యమంత్రి కావడాన్ని ఆపలేరన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement