Monday, April 29, 2024

అభివృద్ది వికేంద్రీకరణకు అర్థం కూడా తెలియదు: వైసీపీపై యనమల సెటైర్

రాజధాని విషయంలో అధికార పార్టీ నేతల వ్యాఖ్యలపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు తీవ్రంగా ఫైర్ అయ్యారు. రాజధానిపై మరో చట్టం తీసుకురావటానికి వీల్లేదని హైకోర్టు ఇచ్చిన తీర్పులో స్పష్టంగా ఉందన్నారు. శాసన సభ రాజ్యాంగానికి లోబడి చట్టాలు చేయాలి తప్ప రాజ్యాంగానికి వ్యతిరేకంగా కాదని హితవు పలికారు. చట్టసభల్లో తమకు బలముందన్న కారణంతో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. వారికి అధికార బలం, అహంకార మదం ఉంది తప్ప ఆలోచన బలం లేదని విమర్శించారు. అభివృద్ది వికేంద్రీకరణకు అర్థం కూడా తెలియకుండా అభివృద్ది వికేంద్రీకరణ గురించి వైసీపీ నేతలు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంని ఎద్దేవా చేశారు. అభివృద్ది వికేంద్రీకరణ అంటే మూడు రాజధానులు కాదన్నారు. బడ్జెట్‌ను అన్ని ప్రాంతాలకు సమానంగా పంచి రాష్ట్రం అంతా అభివృద్ది చేయాలని యనమల డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement