Tuesday, October 15, 2024

NLR: విద్యుత్ షాక్ తో మహిళ దుర్మరణం

నెల్లూరు జిల్లా మనుబోలు మండలంలోని కాగితాల పూర్ క్రాస్ రోడ్ లో ఓ మహిళ విద్యుత్ షాక్ తో మృతి చెందింది. ఈ సంఘటన అర్ధరాత్రి చోటుచేసుకుంది. స్థానికంగా హోటల్ నడుపుతున్న కంటే నాగేశ్వరావు భార్య కంటే రాజేశ్వరమ్మ (44) గ్రైండర్ వేస్తుండగా ఉన్నట్లుండి కరెంటు రావడంతో తీవ్రమైన కరెంట్ షాక్ తగిలి అక్కడికక్కడే పడిపోయింది. ఆమెను గూడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. పరీక్షించిన డాక్టర్లు చనిపోయినట్లుగా ధృవీకరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement