Thursday, April 25, 2024

భవిష్యత్తులో శాస్త్రవేత్తనవుతా… మిస్ ఇండియా టైటిల్ విన్నర్ భావన

తిరుపతి (రాయలసీమ ప్రభ వెబ్ ప్రతినిధి) : భవిష్యత్ లో పెద్ద సైంటిస్ట్ కావాలని ఆశిస్తున్నానని.. మిస్ ఇండియా ఐకానిక్ దివా సీజన్- 3 2023 కి మిస్ ఇండియా టైటిల్ విన్నర్ గా నిలిచిన భావన అన్నారు. స్థానిక ప్రెస్ క్లబ్ లో మంగళవారం మీడియా ముందు తల్లిదండ్రులు గోపికృష్ణ, లక్ష్మి, తమ్ముడు దరహాస్ లతో కలిసి భావన మాట్లాడుతూ.. తాను ఎంఎస్సీ (బయోటెక్నాలజీ) చదువుతున్నానన్నారు. భారతదేశం మొత్తం నుండి ఈ టైటిల్ కోసం గత 15 రోజుల క్రితం వెయ్యి మంది పోటీపడ్డారన్నారు.

ద్వితీయ స్థానంలో 300మంది నిలవగా, టాప్ 20లో తాను ప్రవేశించి, చివరిగా ముంబైలో గత నాలుగు రోజులు జరిగిన ఫైనల్స్ లో మిస్ ఇండియా టైటిల్ విన్నర్ గా నిలవడం ఆనందంగా ఉందన్నారు. ఈ మిస్ ఇండియా (కిరీటo) ను హ్యాపీ నెస్ గా ఎంజాయ్ చేస్తున్నానని తెలిపారు. గతంలో డైరెక్టర్ శీను దర్శకత్వంలో షార్ట్ ఫిలింలో కూడా నటించానన్నారు. తనకు సుప్రజా చౌదరి, కవిత కిషోర్, రియాన్ శర్మలు ఆదర్శమన్నారు. భవిష్యత్తులో సమాజ సేవ చేయడానికి తనవంతు కృషి చేస్తానన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement