Wednesday, April 24, 2024

జాబ్ క్యాలెండర్ ఎక్క‌డ‌.. ఎమ్మెల్యే నిమ్మ‌ల నిర‌స‌న

సిపిఎస్ రద్దు, మెగా డీఎస్సీ, జనవరి జాబ్ క్యాలెండర్ ఏది అంటూ అసెంబ్లీ వెలుపల పాలకొల్లు శాసనసభ్యులు డా.నిమ్మల రామానాయుడు ఈరోజు ప్లకార్డుతో నిలువు కాళ్లపై నిలబడి నిరసన వ్యక్తం చేశారు. వారం రోజుల్లో CPS రద్దు చేస్తానని చెప్పి  ఇప్పటికి 200 వారాలు దాటినా కూడా తాడేపల్లి రాజప్రాసాదం ఎందుకు నోరు విప్పడం లేదు ?. నాడు పాదయాత్రలో మెగా DSC అని చెప్పి, నేడు పాఠశాలలు మూసివేస్తున్నావు.

ప్రతి జనవరిలో జాబ్ క్యాలెండర్ తో ఉద్యోగాలు ఇస్తానని చెప్పి, నేడు ఉన్న నిరుద్యోగ భృతిని కూడా రద్దుచేసి పట్టభద్రుల నోటి కాడ కూడు లాక్కున్నావన్నారు. CPS రద్దు, మెగా DSC, జనవరి జాబ్ క్యాలెండర్ పై నాడు నమ్మించి, నేడు మోసం, దగా చేస్తున్న జగన్ పై ఎందుకు 420 చీటింగ్ కేసు నమోదు చెయ్యకూడదు ? అని టీడీపీ ఎమ్మెల్యే నిమ్మ‌ల రామానాయుడు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement