Friday, May 10, 2024

AP: బాలిక‌పై వృద్దుడి లైంగిక దాడి

ఓ ఎనిమిదేళ్ల బాలిక‌పై వృద్ధుడు లైంగిక దాడికి పాల్ప‌డిన ఘ‌ట‌న ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం మండలం గోపవరంలో ఈ దారుణం వెలుగుచూసింది. మనుమరాలి వయస్సున్న బాలికపై వృద్ధుడు లైంగిక వేధింపులకు పాల్పడటం సంచలనం రేపింది. బాలిక తల్లిదండ్రులు కూలీ పనుల కోసం వెళ్ల‌డంతో.. ఇంట్లో ఒంట‌రిగా ఉన్న బాలిక‌పై వృద్ధుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. భ‌యంతో బాలిక భయంతో కేకలు వేయడంతో.. అతను అక్కడి నుంచి పరారయ్యాడు. ఇంటికొచ్చాక విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement