Monday, April 29, 2024

ఆంధ్రా భూభాగంలోకి ఒడిశా చొర‌బాటు

డుంబ్రిగుడ – విశాఖపట్నం జిల్లాలోని డుంబ్రిగుడ మండలంలోని ఆంధ్రా – ఒడిశా సరిహద్దు వివాదం నివురుగప్పిన నిప్పులా రేగుతూనే ఉంది.ఇరు రాష్ట్రాల అధికారులు జాప్యం చేస్తుండటం తో సరిహద్దు గ్రామాల గిరిజనులకు కంటి మీద కునుకులేకుండా చేస్తోంది. మండలంలోని కొల్లాపూట్‌- పంచాయతీ ని టమామిడి గ్రామం సమీపంలోని సరి హద్దు భూభాగాన్ని దాటు-కొని సుమారు కిలోమీటర్‌ దూరం వరకు ఒడిశా రాష్ట్రానికి చెందిన చొంబాయి పంచాయతీలోని జాన్‌గూడ , కుసుమ సోనాబాయి గ్రామస్తులు, కొట్టంగి జిల్లా అధికారులు ఆధ్వర్యంలో ఆంధ్ర భూభాగాన్ని ఆక్రమించుకున్నారు. ఈ దురాక్ర మణలో పొట్టంగి జిల్లాకు చెందిన రెవిన్యూ, అటవీశాఖ అధికారులు పాల్గొన్నారని సరిహద్దు గ్రామాల గిరిజనులు చెబుతున్నారు. ఒడిశావాసులు ఆంధ్ర భూభాగంలో అటవీ భూములతో పాటు- గిరి రైతుల పొలాల్లో సరిహద్దు రాళ్ళు పాతారు.
ఈ రాళ్లు దాటి- ఆంధ్ర వాసులు రాకూడదని హెచ్చరికలు కూడా జారీ చేశారు. అలాగే ఒడిశా వాసులు చొచ్చుకునివచ్చిన కిలోమీటర్‌ భూభాగంలో ఆంధ్రా వాసులకు ఉన్న కాఫీ సిల్వర్‌ మొక్కలను వెం టనే తొలగించాలని, లేకపోతే నరికి వేస్తామని ఒడిశా వాసులు హెచ్చరించారని నితా మామిడి గ్రామానికి చెందిన కొర్ర రఘు, కోరా బిమే, రామ్‌చం దర్‌, అర్జున్‌ తెలిపారు. ఈ సంఘటనలో ఆంధ్ర్రాప్రాం తానికి చెంది నవారు ఎవరు వారి వద్దకు వెళ్లలేదని, వారే కొంత మంది గ్రామస్తులను పిలిచి హెచ్చరించా రని వారు చెప్పారు. అరకులోయ శాసనసభ్యులు దీనిపై సత్వరమే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు

Advertisement

తాజా వార్తలు

Advertisement