Thursday, May 2, 2024

మహా డబుల్‌ ధమాకా.. మార్చి వరకు టైం..

విశాఖపట్నం, ప్రభన్యూస్ : జీవీఎంసీ గతంలో బిల్డింగ్‌ పీనలైజేషన్‌ స్కీమ్‌ను అమలు చేసింది. అప్పట్లో సుమారు 5400 వరకు దరఖాస్తులు అందాయి. అక్రమ నిర్మాణాలను క్రమబద్దీకరించుకోవడానికి ప్రభుత్వం అప్పట్లో బీపీఎస్‌ స్కీమ్‌ను అమలు చేసింది. అయితే గడువులోగా ఎటువంటి అభ్యంతరాలు లేని దరఖాస్తులను జీవీఎంసీ టౌన్‌ప్లానింగ్‌ విభాగం ద్వారా పరిష్కరించారు. బీపీఎస్‌ నిబంధనలు ప్రకారం ప్రభుత్వ స్థలాలు, గెడ్డలు, వాగులు, వంకలు, రహదారులపై నిర్మాణాలను అనుమతించరు. దీంతో అప్పట్లో చాలా వరకు దరఖాస్తులు పెండింగ్‌లో ఉండిపోయాయి.

ఆయా దరఖాస్తులు కూడా పెండింగ్‌లో ఉన్నాయి. ఈ నేపధ్యంలోనే అటువంటి దరఖాస్తులను పరిశీలించి పరిష్కరించాలని ప్రభుత్వం మార్చి 31 వరకు గడువు పొడిగించింది. గతంలో బీపీఎస్‌ ద్వారా జీవీఎంసీకి పెద్ద మొత్తంలో ఆదాయం లభించింది. ఇప్పుడు పెండింగ్‌ దరఖాస్తులను పరిష్కరిస్తే మరికొంత మొత్తం ఆదాయం లభించే అవకాశం ఉంది.

గతంలో ఎన్నడూలేని విధంగా ల్యాండ్‌ రెగ్యులైజేషన్‌ స్కీమ్‌ (ఎల్‌ఆర్‌ఎస్‌) ను అమలు చేసేందుకు జీవీఎంసీకి ప్రభుత్వం అవకాశం కల్పించింది. అయితే ఈ ప్రక్రియ కొనసాగుతుండగానే ఎల్‌ఆర్‌ఎస్‌ గడువు ముగిసింది. తాజాగా ప్రభుత్వం మార్చి 31 వరకు ఎల్‌ఆర్‌ఎస్‌ గడువును కూడా పొడిగించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement