Friday, April 19, 2024

Fun day: కిల్లర్ లేడీ.. పుష్పలో అతడిని చంపేది అనసూయేనా.. షాకింగ్ ట్విస్ట్..

బుల్లితెరపై తిరుగులేని యాంకర్ గా అనసూయ దూసుకుపోతోంది. తను యాంకరింగ్ చేస్తుంటే ఆ షోకి ఉండే క్రేజే వేరు. తన అందం, చలాకీతనంతో షోని ఎలా సక్సెస్ ఫుల్ గా నడిపించాలో ఆమెకి బాగా తెలుసు. అనసూయ హాట్ నెస్ ముందు కుర్ర హీరోయిన్లు కూడా నిలబడలేరు అంటే అతిశయోక్తి కాదు. మూవీస్ ఎంపిక విషయంలో కూడా అనసూయ చాలా ఇంటెలిజెంట్ గా వ్యవహరిస్తోంది. తన పాత్రకు ఉన్న ప్రాధాన్యతని బట్టి నిర్ణయాలు తీసుకుంటుంది. అందుకే అనసూయ నటించే చిత్రాల్లో ఆమెకు మంచి గుర్తింపు కూడా లభిస్తోంది.

రంగస్థలం సినిమాలో రంగమ్మత్తగా అనసూయ అద్భుతమైన నటన కనబరిచిన సంగతి తెలిసిందే. కంప్లీట్ గ్లామర్ రోల్ కాకుండా తన పాత్రలో నటనకు కూడా ఇంపార్టెన్స్ ఉండేలా అనసూయ జాగ్రత్త పడుతోంది. ప్రస్తుతం అనసూయ.. అల్లు అర్జున్ పుష్ప సినిమాలో కూడా కీలక పాత్రలో నటిస్తోంది. ద్రాక్షాయనిగా ఆమె విభిన్నమైన లుక్ లో కనిపిస్తోంది. పాత రోజుల్లో మహిళలు ఒంటినిండా ఆభరణాలతో, పెద్ద బొట్టుతో కనిపించేవారు. అనసూయ ద్రాక్షాయని పాత్ర అలాగే కనిపిస్తోంది.

ఈ చిత్రం నుంచి రూపు (డిసెంబర్ 6న) ట్రైలర్ రిలీజ్ కానుంది. ట్రైలర్ కంటే ముందుగా చిన్న టీజర్ వదిలారు. ఈ టీజర్ లో అనసూయ క్యారెక్టర్ గురించి చిన్న హింట్ ఇచ్చారు. ఈ లుక్ లో అనసూయపైన చీర కొంగు లేకుండా మంచంపై ఓ వ్యక్తిని అత్యంత దారుణంగా చంపుతున్నట్లు కనిపిస్తోంది. అనసూయ నోటిలో బ్లేడ్ పట్టుకుని ఇస్తున్న లుక్ లో ఆమె కిల్లర్ లేడిని తలపిస్తోంది. ఆమె పాత్రలో ఊహించని ట్విస్ట్ ఉన్నట్లు నెటిజన్లు చెబుతున్నారు. అనసూయ చేతిలో హత్యకు గురి కాబోతున్నది ఎవరో కాదు.. సునీల్ అని అంటున్నారు.

ఈ చిత్రంలో సునీల్ ‘మంగళం శ్రీను’ గా నటిస్తున్నాడు. సునీల్ భార్యగా అనసూయ నటిస్తోందని.. తన భర్తనే ఆమె చంపేస్తోందని ప్రచారం జరుగుతోంది. ఇంతకీ అనసూయ సునీల్ ని ఎందుకు చంపాల్సి వచ్చింది అనేది ఈ చిత్రం ట్విస్ట్ అట. సుకుమార్ చిత్రాల్లో ట్విస్ట్ లు ఊహకు అందని విధంగా ఉంటాయి. రంగస్థలం చిత్రంలో సుకుమార్ అనసూయకు మంచి రోల్ ఇచ్చారు. కానీ, పుష్పలో ఆమె పాత్ర పాజిటివ్ గా ఉంటుందా లేక నెగిటివ్ షేడ్స్ లో ఉంటుందా అనేది ఇప్పటికైతే సస్పెన్సే. ట్రైలర్ ద్వారా మరింత క్లారిటీ రావచ్చు అంటున్నారు నెటిజన్లు.

మొత్తానికి అనసూయ రోల్ మాత్రం ప్రేక్షకులకు పెద్ద సర్ప్రైజ్ అని చెప్పొచ్చు. పుష్ప చిత్రం ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోంది. అల్లు అర్జున్ ఎర్రచందనం అక్రమ రవాణా చేసే డ్రైవర్ గా మొదలై.. డాన్ గా ఎలా మారాడు అనే అంశాలతో సుకుమార్ ఈ చిత్ర కథ రూపొందించారు. యాక్షన్ ఎపిసోడ్స్ కళ్లు చెదిరే విధంగా ఉండబోతున్నట్లు టాక్.

Advertisement

తాజా వార్తలు

Advertisement