Friday, May 3, 2024

విశాఖ స్టీల్ ప‌రిరక్ష‌ణ‌కు మొద‌టి స‌మిథ‌ను నేనే – కార్మికుడి సూసైడ్ నోట్..

విశాఖ‌ప‌ట్నం – విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్ష‌ణ‌కు కార్మిక సంఘాలు ఆందోళ‌న‌ను ఉదృతం చేస్తున్నాయి.. దీనిలో భాగంగా ఇప్ప‌టికే స‌మ్మె నోటీస్ కూడా ఇచ్చారు.. 25వ తేది త‌ర్వాత ఏ క్ష‌ణ‌మైన కార్మికులు స‌మ్మె బాట ప‌ట్టే అవ‌కాశాలున్నాయి.. ఈ నేప‌థ్యంలో విశాఖ ప‌రిరక్ష‌ణ ఉద్య‌మంలో తానే మొద‌ట స‌మిథ‌న‌వుతానుంటూ స్టీట్ ప్లాంట్ ఉద్యోగి శ్రీనివాస‌రావు ముందుగానే సూసైడ్ నోట్ ను విడుద‌ల చేశాడు.. ఈ సూసైడ్ నోట్ తీవ్ర క‌ల‌క‌లం రేపుతున్న‌ది..
విశాఖ ఉక్కు ఉద్యమం తీవ్రతరం అవుతోంది. కార్మికులు, ప్రజా సంఘాలు, పార్టీలు ఆందోళనను కొనసాగిస్తున్నారు.. అలాగే ఈ నెల 25 తర్వాత సమ్మెపై కార్మికులు నిర్ణయం తీసుకోబోతున్నారు. ఈ నేపథ్యంలో స్టీల్ ప్లాంట్ ఉద్యోగి శ్రీనివాసరావు సూసైడ్ నోట్ కలకలంరేపుతోంది. ఆ లేఖ‌లో ‘ప్రియమైన కార్మిక సోదరుల్లారా మనమంతా కలిసికట్టుగా ఉంటేనే ఈ పోరాటంలో విజయం సాధించగలం. ఈ రోజు జరగబోయే ఉక్కు కార్మిక గర్జన ఒక మైలురాయిగా మొదలు కావాలి. 32 మంది ప్రాణ త్యాగాల ప్రతిఫలం ఈ ఉక్కు కర్మాగారం. ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటుపరం కానివ్వద్దు. నేను నా ప్రాణాన్ని ఈ ఉక్కు ఉద్యమం కొరకు త్యాగం చేస్తున్నాను. ఉక్కు ఫ‌ర్నిస్ లో అగ్నికి ఆహుతి కావడానికి ఈరోజు 5:49 నిమిషాలకు ముహూర్తం ఉంది. కాబట్టి ఈ పోరాటం ప్రాణత్యాగం నా నుండి మొదలు కావాలి’ అంటూ సూసైడ్‌ నోట్‌లో పేర్కొన్నాడు. కాగా సూసైడ్ లేఖ రాసి పెట్టిన శ్రీనివాసరావు శనివారం ఉదయం నుంచి కనిపించడంలేదు. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే పోలీసులు కూడా స్పందించారు.. కార్మికుడు శ్రీనివాస‌రావు కోసం పెద్ద ఎత్తున గాలింపు చ‌ర్య‌లు చేపట్టారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement