Thursday, April 25, 2024

Alert: వీడియో కాల్స్.. తస్మాత్ జాగ్రత్త

తిరుపతి (రాయలసీమ ప్రభ న్యూస్ బ్యూరో ) : సామాజిక మధ్యమాల ద్వారా పరిచయం పెంచుకుని వీడియో కాల్ చేసి బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు గుంజే వారు ఉన్నారు జాగ్రత్త అని తిరుపతి జిల్లా పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఈ తరహా మోసాలు ఎలా జరుగుతున్నాయో తెలియజేస్తూ ప్రచారం మొదలు పెట్టారు. ఆ ప్రచారం సారాంశం ప్రకారం కొందరు యువతులు ఫేసుబుక్, ట్విటర్ వంటి మాధ్యమాల ద్వారా పరిచయం చేసుకుంటారు. ఆ పరిచయంతో వీడియో కాల్ చేస్తారు. మాట్లాడుతూ హటాత్తుగా తమ బట్టలు తీసేసి నగ్నంగా కనిపిస్తారు.

ఇవతల చూస్తున్నవారు తెరుకునేలోగా స్క్రీన్ షాట్ తీసుకుంటారు. తాము అడిగిన డబ్బులు ఇవ్వకపోతే ఆ స్క్రీన్ షాట్ ను ఉపయోగించి కేసులు పెట్టి పరువు తీస్తామని, సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తామని బెదిరిస్తారు. ఈ తరహా మోసాలకు యువకులు, ఉద్యోగులు ఎక్కువగా గురయ్యే ప్రమాదం ఉందని పోలీసులు చెబుతున్నారు. ఈ సమస్యను అధిగమించడానికి అపరిచితుల, ముఖ్యంగా కొత్తగా ఫేస్ బుక్, ట్విటర్ వంటి మధ్యమాల్లో పరిచయం అయ్యేవారి వీడియో కాల్స్ ను పట్టించుకోక పోవడమే మంచిదని హెచ్చరిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement