Tuesday, February 27, 2024

వ‌క్ఫ్ బోర్డు ఆస్తులు దోచేసిన ఘ‌నుడు జ‌లీల్ ఖాన్… మంత్రి వెల్లంప‌ల్లి

విజయవాడ: న‌గ‌ర పాల‌క సంస్థ ఎన్నిక‌ల నేప‌థ్యంలో అధికార‌, విపక్షాల మ‌ధ్య మాట‌ల తూటాలు పేలుతున్నాయి.. కౌంట‌ర్, ఎన్ కౌంట‌ర్ల‌తో ప్ర‌చారం రోజు రోజుకి వేడెక్కిపోతున్న‌ది.. ఈ నేప‌థ్యంలో పాత‌బ‌స్తీలో టిడిపికి బ‌ల‌మైన నాయ‌కుడిగా ఉన్న జ‌లీల్ ఖాన్ పై ఆదే నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన వైసిపి మంత్రి వెల్లంప‌ల్లి శ్రీనివాస్ విమ‌ర్శ‌ల దాడిని పెంచారు..టీడీపీ నేత జలీల్‌ఖాన్‌ వక్ఫ్‌ బోర్డు ఆస్తులు దోచుకున్నారని మండిపడ్డారు. రాజకీయాల్లో స్క్రాప్‌ జలీల్‌ఖాన్‌ అని విమర్శించారు. జలీల్ ఖాన్ ఓ సిగ్గులేని వ్యక్తి అని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యేగా ఉన్న జలీల్ ఖాన్ వక్ఫ్ బోర్డు ద్వారా కోట్లు అవినీతి చేశారని ఆరోపించారు. చంద్రబాబు, జలీల్ ఖాన్ అవినీతిపరులని మంత్రి వెల్లంపల్లి విమర్శించారు. కాగా, దుర్గ గుడిలో ఎసిబి దాడుల‌ను ప్ర‌స్తావిస్తూ, అవినీతి నిర్మూల‌న కోస‌మే ఏసీబీ దాడులు నిర్వ‌హిస్తున్న‌ట్లు పేర్కొన్నారు. ప్రభుత్వంలో ఏసీబీ ఓ భాగమని అంటూ వైయ‌స్ జగన్ ముఖ్య‌మంత్రి అయ్యాక ఏసీబీ దాడులు పెరిగాయని చెప్పారు. ఎక్కడా అవినీతి జరగకుండా ఉండటానికి దాడులు చేపడుతున్నట్లు చెప్పారు. ద్వారక తిరుమలలో కూడా గతంలో ఏసీబీ దాడులు జరిగాయని గుర్తు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement